Measles Outbreak: ముంబైలో చిన్నారుల ప్రాణాలను హరిస్తున్న మీజిల్స్.. రంగంలోకి ఉన్నతస్థాయి కేంద్ర బృందాలు..

మీజిల్స్ అంటు వ్యాధి.ఇది చిన్నపిల్లలకు, నవజాత శిశువులకు ముఖ్యంగా ప్రమాదకరం. ఇది ఎబోలా, ఫ్లూ లేదా కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

Measles Outbreak: ముంబైలో చిన్నారుల ప్రాణాలను హరిస్తున్న మీజిల్స్.. రంగంలోకి ఉన్నతస్థాయి కేంద్ర బృందాలు..
Measles Outbreak
Follow us
Surya Kala

|

Updated on: Nov 24, 2022 | 7:24 AM

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మీజిల్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీజిల్స్ ముంబైలో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఎనిమిది నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో ఈ వ్యాధితో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 12కు చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ అప్రమత్తమైంది. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందాలను బాధిత రాష్ట్రాలకు పంపాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈ బృందాలు మీజిల్స్ నియంత్రణకు  కార్యాచరణను రూపొందించి బాధిత రాష్ట్రాల్లో ప్రజారోగ్య చర్యలు చేపట్టనున్నాయి.

  1. ముంబైలో కొత్తగా 13 మీజిల్స్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మొత్తం సోకిన వారి సంఖ్య 233కి చేరింది.
  2. ముంబైలో ఈ వ్యాధి విలయతాండవం చేస్తోందని అధికారులు తెలిపారు. భివాండీకి చెందిన ఎనిమిది నెలల చిన్నారి మంగళవారం సాయంత్రం ముంబైలోని ఆసుపత్రిలో మరణించింది.
  3. నవంబరు 20న చిన్నారికి శరీరమంతా దద్దుర్లు రావడంతో మంగళవారం సాయంత్రం మునిసిపల్ ఆసుపత్రిలో చేర్పించారు.. కానీ గంటల వ్యవధిలోనే చిన్నారి మరణించింది.
  4. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన చెందుతున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలను చేసింది.
  5. ఇవి కూడా చదవండి
  6. రాంచీ, అహ్మదాబాద్, మలప్పురంలలో పిల్లలలో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుదలను అంచనా వేయడానికి.. నివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాలను నియమించింది.
  7. మీజిల్స్ కేసులు పెరుగుతున్న తీరును ఈ బృందాలు పరిశీలిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం, ఈ బృందాలు వ్యాధిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులకు సహాయం చేస్తాయి. ఈ మూడు నగరాల్లో పిల్లల్లో మీజిల్స్ కేసుల పెరుగుదల భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
  8. ముంబైలో..  పౌర అధికారులు గత 24 గంటల్లో 3.04 లక్షల కుటుంబాలను పరీక్షించారు. ఇక్కడ ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నట్లు డేటా చూపించింది.
  9. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తానాజీ సావంత్ మంగళవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులతో సమావేశమయ్యారు.
  10. మీజిల్స్ అంటు వ్యాధి.ఇది చిన్నపిల్లలకు, నవజాత శిశువులకు ముఖ్యంగా ప్రమాదకరం. ఇది ఎబోలా, ఫ్లూ లేదా కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుంది.
  11. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గతేడాది ఈ విషయాన్ని హెచ్చరించింది. 2021తో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో కేసులు 79 శాతం పెరిగాయని UNICEF డేటా ద్వారా తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..