Diplomacy On The Road: దౌత్యం అంటే ప్రజలను కలపడం.. ఢిల్లీ గల్లీల్లో బులెట్ ప్రూఫ్ వాహనాలు వదిలి ఆటోలమీద ప్రయాణిస్తున్న మహిళా దౌత్యవేత్తలు
దేశాల మధ్య దౌత్యం అంటే ప్రజలను కలవడం అని అన్నారు. దౌత్యం అంటే.. ప్రజల గురించి తెలుసుకోవడం, వారితో సంబంధాన్ని ఏర్పరచుకోవడమని.. తాను ప్రతిరోజూ ప్రజలను కలుస్తానని పేర్కొన్నారు.

కొన్ని వార్తలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అలాంటి వార్తల్లో ఇది కూడా ఒకటి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఓ సంఘటన.. ప్రస్తుతం అందరి మదిని ఆకట్టుకుంది. అమెరికన్ ఎంబసీకి చెందిన నలుగురు మహిళా అధికారులు తమ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వదిలి ఆటోలో తమ ఆఫీసుకు వెళ్తున్నారు. ఈ మహిళలు ఆటోలో ఆఫీసుకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మహిళలు ప్రభుత్వం నుండి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పొందారు. అయినప్పటికీ వీరు ఆటో రిక్షాలో ఆఫీసుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు.
ఈ నలుగురు మహిళల పేర్లు ఎన్‌ఎల్ మాసన్, రూత్ హోల్‌బెర్గ్, షరీన్ జె కిట్టర్‌మాన్ , జెన్నిఫర్ బైవాటర్స్. ఇలా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ఈ మహిళలను అడిగితే.. వారు చెప్పిన సమాధానం అందరికీ నచ్చే విధంగా ఉంది. అమెరికాకు చెందిన ఈ మహిళలు స్పందిస్తూ.. ఆటోలు నడపడం అంటే తమకు ఇష్టమని చెబుతున్నారు. అంతేకాదు అమెరికా అధికారులు కూడా సామాన్యులలాగే జీవిస్తారనే సందేశాన్ని సామాన్యులకు అందించాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.
తాము పదువురికి ఉదాహరణగా నిలిచేందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నామని మహిళలు చెబుతున్నారు. NL మేసన్.. న్యూస్ ఏజెన్సీ ANI తో మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకూ క్లచ్ వాహనాలను నడపలేదని అన్నారు. అంతేకాదు తాను మొదటి నుంచి ఆటోమేటిక్ వాహనాలు నడుపుతున్నానని చెప్పారు. అయితే భారతదేశంలో ఆటో నడపడం కొత్త అనుభూతినిస్తోందని చెప్పారు. అదే సమయంలో, రూత్ హోల్‌బెర్గ్ తనకు ఆటో నడపడం ఇష్టమని చెప్పారు. అంతేకాదు తాను ఆటోలోనే మార్కెట్‌కి వెళ్తానని చెప్పారు.




తమని చూసి మహిళలు స్ఫూర్తి పొందుతారని అన్నారు. అదే సమయంలో దౌత్యంలో పనిచేయడం అనే ప్రశ్నపై స్పందిస్తూ.. దేశాల మధ్య దౌత్యం అంటే ప్రజలను కలవడం అని అన్నారు. దౌత్యం అంటే.. ప్రజల గురించి తెలుసుకోవడం, వారితో సంబంధాన్ని ఏర్పరచుకోవడమని.. తాను ప్రతిరోజూ ప్రజలను కలుస్తానని పేర్కొన్నారు.
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ దౌత్యవేత్త షరీన్ జె కిట్టర్‌మాన్ తన వద్ద పింక్ కలర్ ఆటో ఉందని చెప్పారు. కిట్టర్‌మన్ కర్ణాటకలో జన్మించింది. ఆమె ఆటోమీద అమెరికా, భారతదేశం జెండాలు ఉన్నాయి. షరీన్ కు అమెరికా పౌరసత్వం ఉంది. తనకు ఆటో నడపడం కూడా ఇష్టమని చెప్పారు. అదే సమయంలో జెన్నిఫర్ బైవాటర్స్ మాట్లాడుతూ, తనకు కూడా ఆటో నడపడం చాలా ఇష్టం. ఇంతకుముందు ఆటోలో మేసన్‌తో కలిసి ఆఫీసుకు వెళ్లేదానిని అని.. తర్వాత తానే ఆటో కొనుక్కున్నానని చెప్పారు. ఒక్కోసారి మనం మన పరిధికి మించి ఆలోచించాల్సి ఉంటుందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




