Shraddha Murder Case: ‘నన్ను చంపేసి ముక్కలు చేస్తాడని..’ రెండేళ్ల క్రితమే పోలీసులకు శ్రద్ధ ఫిర్యాదు.. సంచలనం సృష్టిస్తున్న అలనాటి లేఖ

పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇక్కడ కూడా బ్లాక్‌మెయిల్‌కు దిగాడు నిందితుడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. భయపడ్డ శ్రద్ధా తన ఫిర్యాదును తిరిగి తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా ఈ కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

Shraddha Murder Case: 'నన్ను చంపేసి ముక్కలు చేస్తాడని..' రెండేళ్ల క్రితమే పోలీసులకు శ్రద్ధ ఫిర్యాదు.. సంచలనం సృష్టిస్తున్న అలనాటి లేఖ
Shraddha Murder Case
Follow us
Surya Kala

|

Updated on: Nov 24, 2022 | 7:11 AM

శ్రద్ధా మర్డర్‌ కేసులో మరో ట్విస్ట్‌. ఆలస్యంగా బయటకు వచ్చిన బాధితురాలి ఫిర్యాదు లేఖ సంచలనాలు సృష్టిస్తోంది. పోలీసులుకు దొరికిన ఆ లేఖలో మృతురాలు ఏం రాసింది? ఎందుకు రాయాల్సి వచ్చింది? అఫ్తాద్‌తో మొదటి నుంచి గొడవలు ఉన్నాయా? ఉంటే ఏ స్థాయిలోఉన్నాయి. ముంబై నుంచి ఢిల్లీ వరకు సాగిన క్రైమ్‌ సీరియల్‌లో రోజుకో కొత్త టర్నింగ్‌. కొత్త కొత్త ట్విస్ట్‌లు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధ హత్య కేసులో మరో బిగ్‌ బ్రేకింగ్‌ వచ్చింది. 2020లో కూడా హత్యకు అఫ్తాద్‌ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ముందే ఓ సారి.. శ్రద్దను చంపేందుకు అఫ్తాద్‌ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఆ గొడవ పెద్దదిగా మారింది. సమస్యపై 23 నవంబర్ 2020లోనే ముంబై నలసుపరా పోలీస్ స్టేషన్‌లో శ్రద్ధ ఫిర్యాదు చేసింది. స్నేహితులకు కూడా చెప్పుకుంది శ్రద్ధ.

2020లో పోలీసులకు రాసిన లేఖలో తన లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని.. తన మృతదేహాన్ని ముక్కలుగా నరికివేస్తానని బెదిరిస్తున్నాడని శ్రద్ధా వాకర్ ఆరోపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన లేఖ ద్వారా ఆఫ్తాబ్ శ్రద్ధాను క్రమం తప్పకుండా కొట్టేవాడని తెలుస్తోంది. “ఆరు నెలలుగా అతను నన్ను కొడుతున్నాడు” అని..  అఫ్తాబ్ తనను కొట్టాడని, చంపడానికి ప్రయత్నించాడని అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసునని లేఖలో పేర్కొంది.

ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. విచారణలో నిమిషానికో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అటు.. అఫ్తాబ్‌పై సాక్ష్యాధారాల కోసం విచారణ కొనసాగుతుంది. ఇతని క్రూరత్వంపై వెలుగులోకి వస్తున్న నిజాలు షాక్‌ ఇస్తున్నాయి. పాయింట్‌ టు పాయింట్‌ ఫిర్యాదులో వివరించింది శ్రద్దా. నిత్యం అఫ్తాద్‌ గొడవ పడేవాడని, అంతటితో ఆగకుండా కొడుతూ చిత్రహింసలకు పాల్పడేవాడని తెలుస్తుంది. 2020లో శ్రద్ధని కొట్టడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగేలా ఉత్తరాఖండ్‌కు షిఫ్ట్‌ అయ్యారు. అక్కడ కూడా చంపేందకు ప్రయత్నించాడు. ఈ ఘోరాన్నంతటిని పోలీస్‌ ఫిర్యాదులో వివరించిన శ్రద్దా.. ఇద్దరి మధ్య ఉన్న గొడవలపై ఓ స్నేహితురాలి దగ్గర చెప్పుకుంది.

ఇవి కూడా చదవండి

శ్రద్దా ఫిర్యాదుపై విచారణలో భాగంగా అఫ్తాద్‌ను ముంబై పోలీసులు విచారణకు కూడా పిలిచారు. ఆ తర్వాత పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇక్కడ కూడా బ్లాక్‌మెయిల్‌కు దిగాడు నిందితుడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. భయపడ్డ శ్రద్ధా తన ఫిర్యాదును తిరిగి తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా ఈ కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

అఫ్తాబ్ ఆమెను ఎలా దారుణంగా కొట్టేవాడో శ్రద్ధా స్నేహితురాలు ఓ ఫోటోను కూడా ఇప్పటికే బయట పెట్టింది. అయితే శ్రద్దా వీటన్నింటిని ఎదుర్కొని కూడా బతికే ఉండాలని కోరుకుంది. అఫ్తాబ్‌తో సంతోషంగా జీవించాలని కోరుకుంది. అందుకే తనకు ఎన్ని దెబ్బలు తాగినా ఈ ఫోటోలో కూడా ఆమె నవ్వుతోంది. మెడ నుండి చెంప వరకు గాయం గుర్తులు కనిపిస్తాయి.

ముంబైలోని ఓజోన్‌ ఆసుపత్రిలో 2020 డిసెంబర్‌ 3న చేరింది. వెన్నులో విపరీతమైన నొప్పి రావడంతో శ్రద్ధా ఆస్పత్రిలో చేరింది. దాదాపు వారం రోజుల పాటు తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడింది. ఈ సమయంలో తన బాధను స్నేహితుల దగ్గర చెప్పుకుంది. తీవ్రంగా కొట్టడమే కాకుండా.. గంజాయి కూడా అలవాటు ఉందని వివరిచింది.

ఇక ఢిల్లీకి చేరుకోవడానికి కొన్ని రోజుల ముందు అంటే మే 4న, శ్రద్ధా అఫ్తాబ్‌తో కలిసి ఉత్తరాఖండ్‌లోని శివపురి సమీపంలోని వశిష్ట గుహకు వెళ్లింది. ఈ గుహ గంగా నది ఒడ్డున ఉంది, శ్రద్ధా అక్కడ నుండి చివరి రీలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. 1500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. సూర్యాస్తమయాన్ని చూసేందుకు వెళ్లామంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మే 11న, హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ కేఫ్‌ దిగిన ఫోటోను కూడా పోస్ట్‌ చేసింది. ఫోటోపై క్యాప్షన్‌ ఇచ్చిన శ్రద్ధా.. మరింత ఎక్కువగా అన్వేషించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ఇలాంటి విషయాలన్నింటిని విచారణలోకి తీసుకోనున్నారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటి వరకు పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. మే 18వ తేదీ సాయంత్రం తన సహచర భాగస్వామి శ్రద్ధా వాకర్‌ని గొంతు కోసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. దక్షిణ ఢిల్లీ మెహ్రౌలీలోని తన నివాసంలో ఫ్రిడ్జిలో పెట్టాడు. దాదాపు 18 రోజులు ఆ ఫ్రిడ్జిలో పెట్టి.. కొన్ని కొన్ని ముక్కలను కొన్ని కొన్ని ప్రాంతాల్లో విసిరేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి