AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు.. తీగ లాగిన పోలీసులకు అదిరే ట్విస్టులు..

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్నారులు నదిలో శవాలుగా తేలారు. ఏం పాపం ఎరుగని కంటి పాపలు విగతజీవులుగా మారారు. మహారాష్ట్రలోని వాన్ నదిలో శిశువుల మృత దేహాలు కనిపించడం పెను సంచలనం రేపింది. చనిపోయిన..

Maharashtra: నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు.. తీగ లాగిన పోలీసులకు అదిరే ట్విస్టులు..
Crime News
Ganesh Mudavath
|

Updated on: Nov 24, 2022 | 7:10 AM

Share

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్నారులు నదిలో శవాలుగా తేలారు. ఏం పాపం ఎరుగని కంటి పాపలు విగతజీవులుగా మారారు. మహారాష్ట్రలోని వాన్ నదిలో శిశువుల మృత దేహాలు కనిపించడం పెను సంచలనం రేపింది. చనిపోయిన చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు నదిలో వదిలేశారు. బుల్దానా జిల్లా సంగ్రామ్‌పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న తమ్‌గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టగా వారికి సంచలన విషయాలు తెలిశాయి. పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ మొదలైనట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలియగానే నది వద్దకు గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానిక ప్రజలు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వైద్యులు ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్‌ను నడుపుతున్నారని, అలా చేసి చనిపోయిన శిశువుల అవశేషాలను నదిలో పడేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తమ్‌గావ్ పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో అక్రమ అబార్షన్ రాకెట్ చురుగ్గా సాగుతున్నట్లు పోలీసులు అంగీకరించినా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయక పోవడం గమనార్హం.

బుల్దానాలోని సంగ్రామ్‌పూర్ తాలూకా కోలాడ్ గ్రామంలోని వాన్ నదిలో చాలా మృతదేహాలు కనిపించాయి. వీటి వయసు నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఉండవచ్చు. ఈ ఘటన గ్రామం మొత్తం భయాందోళనకు గురి చేసింది. దీంతో గ్రామస్థులు సమీపంలోని తమ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 318 కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో తమ్‌గావ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ప్రాంతంలో అబార్షన్ రాకెట్ చట్టవిరుద్ధంగా పనిచేస్తోందని ప్రాథమిక విచారణలో గుర్తించారు. త్వరలో వాటిని కఠినతరం చేస్తామని గ్రామస్థులకు నచ్చ జెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా