Shraddha Murder Case: శ్రద్దా స్నేహితుల వాంగ్మూలంలో సంచలన విషయాలు.. నడవలేనంతగా కొట్టినా అఫ్తాబ్ కావాలంటూ వెళ్లిన శ్రద్ధ ..

శ్రద్ధ మా తమ్ముడి ఇంటికి వచ్చింది. అప్పటికే శ్రద్ధా పరిస్థితి బాగోలేదు. శ్రద్ధ కళ్ల కింద ముఖం మీద నల్లటి గడ్డ, నడుము కింది భాగంలో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు అనిపించింది అంతేకాదు ఆమె నడకలో తేడా స్పష్టంగా కనిపించింది. శ్రద్ధా తన పరిస్థితి తన బాధను తనకు చెప్పింది. ఈ విషయమై సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని పేర్కొన్నాడు.

Shraddha Murder Case: శ్రద్దా స్నేహితుల వాంగ్మూలంలో సంచలన విషయాలు.. నడవలేనంతగా కొట్టినా అఫ్తాబ్ కావాలంటూ వెళ్లిన శ్రద్ధ ..
Shraddha Murder Case
Follow us
Surya Kala

|

Updated on: Nov 19, 2022 | 7:40 PM

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన శ్రద్ధా హత్య కేసు యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితుడు అఫ్తాబ్ చాలా తెలివిగా వాంగ్మూలాలను తరచుగా మారుస్తున్నాడు.  మెహ్రౌలీ అడవి నుండి మరో 2 శ్రద్ధా ముక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిని ల్యాబ్ కి టెస్ట్ కోసం పంపించారు. అయితే గతంలో శ్రద్ధా 35 ముక్కలు చేశానని అఫ్తాబ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.. తాజాగా తన స్టేట్‌మెంట్ మార్చుకున్నాడు. ఇప్పుడు తాను  18 ముక్కలు చేసినట్లు చెబుతున్నారు. ఓ వైపు కోర్టు అతడికి నార్కో టెస్ట్‌కు ఆదేశించగా, మరోవైపు సాక్ష్యాధారాలను పరిశీలించేందుకు ఢిల్లీ పోలీసులు ఈరోజు అఫ్తాబ్ గురుగ్రామ్ కి చేరుకున్నారు. శ్రద్ధ హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసు బృందం శనివారం శ్రద్ధ స్నేహితులైన గాడ్విన్, రాహుల్ రాయ్‌లను విచారించింది. మాణిక్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ రాహుల్ రాయ్‌ను విచారించింది. క్రైమ్ బ్రాంచ్ లోనే ఢిల్లీ పోలీసు బృందం ఉంది. విచారణ సమయంలో శ్రద్ధా స్నేహితుడు గాడ్విన్ అఫ్తాబ్ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. అఫ్తాబ్ శ్రద్ధాను దారుణంగా హింసించేవాడని గాడ్విన్ చెప్పాడు. అఫ్తాబ్ శ్రద్ధను చంపే ముందు 10-12 సార్లు కొట్టాడని పేర్కొన్నాడు.

ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఇద్దరు స్నేహితుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మొదట గాడ్విన్, రెండవది  రాహుల్. ఢిల్లీ పోలీసులు, మరికొందరు అధికారులు అఫ్తాబ్, శ్రద్ధా కుటుంబీకుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయవచ్చని భావిస్తున్నారు.

గురుగ్రామ్‌లో ముగిసిన నేటి సెర్చ్ ఆపరేషన్  మరోవైపు, గురుగ్రామ్‌లోని నిందితుడు అఫ్తాబ్ ఆఫీస్ దగ్గర నేటి సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. ఢిల్లీ పోలీసు బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు శ్రద్ధా హత్య కేసును విచారించేందుకు ఢిల్లీ పోలీసుల బృందం ఉత్తరాఖండ్‌కు బయలుదేరింది. ఢిల్లీ పోలీసు బృందం డెహ్రాడూన్ పోలీసులతో టచ్‌లో ఉంది. రిషికేశ్ సమీపంలోని వశిష్ఠ గుహను, శ్రద్ధా, అఫ్తాబ్‌లు పర్యటించిన ప్రదేశాలను పోలీసులు సందర్శించనున్నారు. అఫ్తాబ్ విచారణ బృందంతో లేకపోయినా..  అఫ్తాబ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా డెహ్రాడూన్‌లో ఢిల్లీ పోలీసుల బృందం తదుపరి పరిశోధన చేయనున్నారు.

చాలా రహస్యాలు చెప్పిన గాడ్విన్ 

శ్రద్ధా సహోద్యోగి సోదరుడు గోడివాన్ ఈరోజు ఢిల్లీ పోలీసుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చాడు సుమారు  6 గంటల పాటు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో, శ్రద్ధా నవంబర్ 2020లో తన బాస్ నుండి సహాయం కోరిందని.. పేర్కొన్నాడు. అయితే అంతకు ముందు వరకూ శ్రద్ధా ఎవరో తనకు తెలియదని గాడ్విన్ వెల్లడించాడు. తన సోదరుడు శ్రద్ధా కి కొలీగ్ అని గాడ్విన్ చెప్పాడు. ఒకరోజు అకస్మాత్తుగా తన సోదరుడికి శ్రద్ధా కాల్ చేసి.. తనకు సహాయం చేయమని అడిగిందని.. అప్పుడు తన అన్న తనకు శ్రద్ధకు హెల్ప్ చేయమని చెప్పినట్లు గాడ్విన్ చెప్పాడు. శ్రద్ధ మా తమ్ముడి ఇంటికి వచ్చింది. అప్పటికే శ్రద్ధా పరిస్థితి బాగోలేదు. శ్రద్ధ కళ్ల కింద ముఖం మీద నల్లటి గడ్డ, నడుము కింది భాగంలో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు అనిపించింది అంతేకాదు ఆమె నడకలో తేడా స్పష్టంగా కనిపించింది. శ్రద్ధా తన పరిస్థితి తన బాధను తనకు చెప్పింది.  ఈ విషయమై సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని పేర్కొన్నాడు.  అయితే ఇంత జరిగినా  శ్రద్ధ మళ్లీ అఫ్తాబ్‌తో కలిసి జీవించడం ప్రారంభించిందని గాడ్విన్ చాలా విషయాలను పోలీసులకు వెల్లడించాడు.

హిమాచల్-ఉత్తరాఖండ్ పోలీసులు

ఢిల్లీ పోలీసులు కేసు విచారిస్తున్న సమయంలో రోజుకో కొన్ని కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ పోలీసులు కూడా కలిసి విచారణ జరుపుతున్నారు.  శ్రద్ధ , అఫ్తాబ్ కలిసి హిమాచల్ సందర్శించడానికి వెళ్ళారు. ఉత్తరాఖండ్‌లోని కొండల్లో శ్రద్ధ మృతదేహంలోని కొన్ని ముక్కలను అఫ్తాబ్ విసిరినట్లు సమాచారం కూడా అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్ప్పుడు అఫ్తాబ్‌ పై  ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం తమకు అప్పగించాల్సిందిగా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నార్కో పరీక్షను 5 రోజుల్లో పూర్తి చేయాలని సూచనలు అదే సమయంలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా నార్కో పరీక్షను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 18వ తేదీ సాయంత్రం అఫ్తాబ్ తన లివ్ ఇన్ పార్ట్‌నర్ శ్రద్ధా వాకర్ (27)ని గొంతు కోసి హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. నిందితుడు దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన నివాసంలో పెద్ద రిఫ్రిజిరేటర్‌లో శరీర భాగాలను సుమారు మూడు వారాల పాటు ఉంచాడు.చాలా రోజుల పాటు వాటిని వివిధ భాగాలలో విసిరాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..