Measles: ‘తట్టు’ కోలేకపోతోన్న ముంబై మహానగరం.. మీజిల్స్‌తో 11 మంది మృత్యువాత.. భారీగా పెరుగుతున్న కేసులు

తాజాగా మీజిల్స్ వ్యాధితో ఏడాది వయస్సున్న చిన్నారి ప్రాణం పోయింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఏడాదిలో పదకొండు మంది తట్టు వల్ల ప్రాణాలు కోల్పోయారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 220 కేసులు నమోదయ్యాయి.

Measles: 'తట్టు' కోలేకపోతోన్న ముంబై మహానగరం.. మీజిల్స్‌తో 11 మంది మృత్యువాత.. భారీగా పెరుగుతున్న కేసులు
Measles Outbreak
Follow us

|

Updated on: Nov 24, 2022 | 7:16 AM

దేశంలో కరోనా తర్వాత ముంబై ఇంకో వ్యాధితో తట్టుకోలేకపోతుంది. రోజురోజుకు ఆ వ్యాధి కేసులు పెరుగుతూ, మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. మరి అది ఏం వ్యాధి అంటే..? తట్టు.. అవున తట్టువ్యాధి దాటికి తట్టుకోలేకపోతుంది ముంబై. రోజురోజుకు కేసులు పెరుగిపోతున్నాయి. ఒక్కరోజే మహానగరంలో 20 మంది తట్టు బారినపడ్డారు. తాజాగా ఈ వ్యాధితో ఏడాది వయస్సున్న చిన్నారి ప్రాణం పోయింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఏడాదిలో పదకొండు మంది తట్టు వల్ల ప్రాణాలు కోల్పోయారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 220 కేసులు నమోదయ్యాయి. ఈ మీజిల్స్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తొమ్మిది నెలల నుంచి ఐదేండ్ల వయస్సు ఉన్న తమ చిన్నారులకు వెంటనే టీకాలు వేయించాలని ముంబై కార్పోరేషన్‌ చెబుతోంది. కాగా, మీజిల్స్‌ చికిత్స కోసం అంధేరిలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపింది. ఈ వ్యాధి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది.. ఇవన్నీ కలగలిసి వ్యాధి ముదిరి మరణానికి కారణమవుతాయి. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏటా 1.40 లక్షల మంది..

కాగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి మీజిల్స్‌ సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు. కొందరిలో విరేచనాలు, న్యుమోనియా కూడా ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే అపాయం. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉంది. కాగా ఈ రోగానికి 1963లోనే వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రపంచవ్యాప్తంగాఏటా లక్షా 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇవి కూడా చదవండి
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.