Dharmendra Pradhan: కేజ్రీవాల్ ప్రభుత్వ మోసం త్వరలోనే బయటపడుతుంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని చంపేస్తోందంటూ ఆరోపించారు.

Dharmendra Pradhan: కేజ్రీవాల్ ప్రభుత్వ మోసం త్వరలోనే బయటపడుతుంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు..
Dharmendra Pradhan
Follow us

|

Updated on: Nov 24, 2022 | 8:31 AM

MCD elections: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని చంపేస్తోందంటూ ఆరోపించారు. మద్యం పాలసీతో కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని.. దీనిని ఢిల్లీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరంటూ ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యా సహా అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందంటూ ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న మోసం, వంచనను త్వరలోనే బయటపడుతుందంటూ ప్రధాన్ పేర్కొన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ప్రధాన్.. బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ.. అబద్ధాలు మాట్లాడుతుందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు అధికార రాష్ట్ర ఆప్ పై ఆగ్రహంతో ఉన్నారని.. రాబోయే ఎంసీడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఓటు వేసి గెలిపిస్తారని పేర్కొన్నారు.

‘‘బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సామాన్యులకు అనుబంధం ఉంది. ప్రస్తుతం ఇక్కడ పాలిస్తున్న అవినీతి పార్టీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు’’ అని ప్రధాన్ అన్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసిన కేంద్రమంత్రి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మంత్రి సత్యేంద్ర జైన్‌కు తీహార్ జైలులో ప్రత్యేక చికిత్స, సదుపాయాలు కల్పించడంపై ప్రధాన్ విమర్శలు గుప్పించారు. “సత్యేంద్ర జైన్‌కి 5-స్టార్ హోటల్‌లో ట్రీట్‌మెంట్ ఇవ్వమని డాక్టర్ వారిని అడిగారా?” అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీరుపై ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. అవినీతి వ్యతిరేక నేత అన్నా హజారే శిష్యులమని చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఎలా అవినీతికి పాల్పడ్డారో త్వరలోనే బట్టబయలు అవుతుందని పేర్కొన్నారు.

ఇదిలావుండగా, 15 ఏళ్లపాటు ఎంసీడీని చేజిక్కించుకుని.. తన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైన బీజేపీకి ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా అన్నారు.

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)లో BJP అధికారంలో ఉంది. వరుసగా మూడు పర్యాయాలపాటు బీజేపీ అధికారంలో ఉంది. 250 వార్డుల ఎంసీడీకి డిసెంబర్ 4న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం