AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Stunt: విషాదం నింపిన విన్యాసం.. బైక్‌పై స్టంట్ చేయాలనుకున్నాడు.. కానీ చివరికి ఇలా.. షాకింగ్ వీడియో

డేంజర్‌.. యమ డేంజర్.. అయినా.. సెల్ఫీల కోసం వేట.. సోషల్‌ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం ఆట.. కొంచెం అటు ఇటు అయితే ఏమౌతుందో తెలుసా.. ప్రాణమే పోతుంది. ఇక్కడా అదే జరిగింది.

Bike Stunt: విషాదం నింపిన విన్యాసం.. బైక్‌పై స్టంట్ చేయాలనుకున్నాడు.. కానీ చివరికి ఇలా.. షాకింగ్ వీడియో
Vuyyuru Bike Stunt
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2022 | 12:07 PM

Share

Vuyyuru Bike Stunt: డేంజర్‌.. యమ డేంజర్.. అయినా.. సెల్ఫీల కోసం వేట.. సోషల్‌ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం ఆట.. కొంచెం అటు ఇటు అయితే ఏమౌతుందో తెలుసా.. ప్రాణమే పోతుంది. ఇక్కడా అదే జరిగింది. సోషల్‌ మీడియాలో లైక్‌లు రావాలన్నది సాయికృష్ణ ఆరాటం. ఇందుకోసం డేంజర్‌ స్టంట్ చేశాడు. ఏకంగా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా ఉయ్యూరులో చోటుచేసుకుంది. సినిమా ఫక్కీలో హైవేపై విన్యాసాలు చేసిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉయ్యూరు బైపాస్‌ రోడ్డులో 20 రోజుల క్రితం సాయికృష్ణ ద్విచక్రవాహనంతో డేంజర్‌ స్టంట్ చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పింది.. ప్రమాదవశాస్తూ కిందపడ్డాడు. అంతే కట్‌ చేస్తే.. హాస్పిటల్‌ బెడ్ ఎక్కాడు. 20 రోజులపాటు మృత్యువుతో పోరాడాడు. సాయికృష్ణ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. చివరకు చికిత్స పొందుతూ.. ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సాయికృష్ణ బైక్‌పై నిలబడి స్టంట్ చేశాడు. ఈ క్రమంలో బైక్ పట్టు తప్పింది. నేరుగా సాయికృష్ణ రోడ్డుపై పడిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. మెదడుకు బలమైన దెబ్బ తగలడంతో సాయి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గౌరి సాయికృష్ణ మృతి ఉయ్యూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లితండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

ఉయ్యూరు హైవేపై బైక్‌ స్టంట్లు కామన్‌గా మారాయని అంటున్నారు స్థానికులు. సరదా, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారేందుకు ఈ తరహా స్టంట్లు చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. సాయికృష్ణ సైతం డేంజర్ ఫీట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఫ్రెండ్స్‌ను ఫోటో తీయమని చెప్పిన సాయికృష్ణ ఎవ్వరూ చేయని విధంగా స్టంట్‌ చేయాలనుకున్నాడు. కాని పట్టు తప్పింది. నడిరోడ్డుపై ప్రమాదకర స్థితిలో పడిపోయాడు. అంతే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ప్రమాదం అని తెలుసు, కాస్తా.. అటు ఇటు అయితే ఏం జరుగుతుందో తెలుసు. అయినా యువకులు ఇలా డేంజర్ స్టంట్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చివరకు తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఈ వీడియో చూశాక అయినా స్టంట్ చేయాలనుకునే వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం.

మరిన్ని ఏపీ వార్తల కోసం..