AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు డిక్కీ నుంచి దుర్వాసన.. ఏంటోనని ఓపెన్‌ చేసి చూడగా.. కళ్లు బైర్లు..

భిలాయికి చెందిన ప్రియాంక సింగ్‌ అనే యువతి దయాల్‌బంద్‌ ప్రాంతంలో నివసిస్తూ.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రియాంక కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కారు డిక్కీ నుంచి దుర్వాసన.. ఏంటోనని ఓపెన్‌ చేసి చూడగా.. కళ్లు బైర్లు..
Chhattisgarh Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 21, 2022 | 11:45 AM

Share

సహోద్యోగి కావడంతో.. ఆమె అతనితో స్నేహం చేసింది.. అదే ఆమె పాలిట మృత్యుశాపమైంది. పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలొస్తాయని నమ్మించాడు.. చివరకు డబ్బుల విషయంపై ఆమె నిలదీయడంతో.. మహిళను హత్యచేశాడు. అనంతరం ఆమె శవాన్ని కారు డిక్కీలో ఉంచాడు. నాలుగు రోజుల తర్వాత ఆదివారం మృతదేహాన్ని ఉంచిన కారు నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. భిలాయికి చెందిన ప్రియాంక సింగ్‌ అనే యువతి దయాల్‌బంద్‌ ప్రాంతంలో నివసిస్తూ.. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రియాంక కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రియాంక కాల్‌ డేటాను పరిశీలించగా.. చివరగా తన సహోద్యోగి ఆశిశ్‌తో మాట్లాడినట్లు నిర్ధారణ అయింది.

దీంతో అశిశ్‌ సాహూను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో దాచిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారు డోరు తెరవగా.. ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని, యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

మృతుడు బిలాస్‌పూర్‌లోని ఆశిశ్‌ సాహు తిక్రపరా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు మహిళతో స్నేహం పేరిట పరిచయమై.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె నష్టపోవడంతో.. డబ్బు లావాదేవీకి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు.

డబ్బుల కోసం యువతి నిలదీయడంతో గొంతునులిమి హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడఉ. అనంతరం మృతదేహాన్ని తన కారులో ఉంచి కస్తూర్బా నగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చి అలానే ఉంచినట్లు తెలిపాడు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం..

Follow Us
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..