- Telugu News Photo Gallery Business photos Start business with just Rs 2000 investment and you can earn up to Rs 4 lakh monthly, know about Bonsai Farming
సూపర్ ఐడియా గురూ..! జస్ట్ రూ.2 వేలతో నెలకు 4 లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
బోన్సాయ్.. జపనీస్ కళారూపానికి చెందిన ఈ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. చెట్ల పరిమాణం, ఆకృతికి అందరూ ఫిదా అవుతుంటారు. కుండీలలో పెంచే మరుగుజ్జు వృక్షాలు చాలామంది ఇళ్లలో కనిపిస్తాయి. అయితే, బోన్సాయి మొక్కల సాగు పద్ధతులతో రూ. లక్షల్లో ఆదాయం గడించవచ్చని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు.
Updated on: Nov 22, 2022 | 1:39 PM

బోన్సాయ్.. జపనీస్ కళారూపానికి చెందిన ఈ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. చెట్ల పరిమాణం, ఆకృతికి అందరూ ఫిదా అవుతుంటారు. కుండీలలో పెంచే మరుగుజ్జు వృక్షాలు చాలామంది ఇళ్లలో కనిపిస్తాయి. అయితే, బోన్సాయి మొక్కల సాగు పద్ధతులతో రూ. లక్షల్లో ఆదాయం గడించవచ్చని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నర్సరీ మార్కెట్లో బోన్సాయ్ మొక్కల పోటీతత్వం పెరిగింది. గుర్తింపు పొందిన కంపెనీల విక్రయాలు, లాభాల అంచనాలు.. మార్కెట్లో ఈ బోన్సాయ్ మొక్కలకు మంచి డిమాండ్ ఉందని పేర్కొంటున్నాయి. గ్లోబల్ మార్కెట్ అధ్యయనంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బోన్సాయ్ మొక్కలకు డిమాండ్ పెరిగిందని.. వీటితో భారీ లాభాలను గడించవచ్చని పేర్కొంటున్నారు.

ఈ రోజుల్లో బోన్సాయ్ మొక్కలను అదృష్ట మొక్కగా పరిగణిస్తున్నారు. దీనిని గృహాలు, కార్యాలయాలలో అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో ఈ మొక్కల ధర రూ.200 నుంచి దాదాపు రూ.2500 వరకు పలుకుతోంది.అంతేకాకుండా బోన్సాయ్ మొక్కపై అభిమానం ఉన్నవారు చెప్పిన ధర కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు. సాధారణ వ్యవసాయం, బోన్సాయ్ మొక్కల సాగు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనికోసం సరైన మట్టిని ఎంచుకోవడం ముఖ్యం. బోన్సాయ్ నాటు నుంచి మొక్క చిగురించే ప్రక్రియ, మొక్క విస్తీర్ణం, పొడవు వరకు ప్రతిదీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. సాధారణ మొక్కల మాదిరిగా కాకుండా, బోన్సాయి ఆకు లేదా పువ్వుల వరకు సాగు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది.

వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు స్వచ్ఛమైన నీరు, ఇసుక నేల లేదా మంచి మట్టి, మట్టి కుండ లేదా గాజు కుండ, మైదాన ప్రాంతం లేదా టెర్రస్ 100 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి, శుభ్రమైన గులకరాళ్లు లేదా గాజు ముక్కలు, తీగ, మొక్కపై నీటిని చల్లడానికి స్ప్రే బాటిల్ అవసరం. ఇంకా షెడ్ లా నిర్మించాలనుకుంటే నెట్ అవసరం..

మీరు పరిమిత మూలధనంతో బోన్సాయ్ మొక్కల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే, లాభం పొందడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇవి సిద్ధమవ్వడానికి కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది. నర్సరీ నుంచి సిద్ధంగా ఉన్న మొక్కలను తెచ్చి 30 నుంచి 50 శాతం అధిక ధరకు విక్రయించడం ద్వారా కూడా మీరు సంపాదించవచ్చు.

సాగుకు మూడేళ్లలో ఒక్కో మొక్కకు సగటున రూ.240 ఖర్చు అవుతుంది. సాగును ప్రోత్సహించేందుకు, రైతుకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు రూ.120 చొప్పున అందజేస్తుంది. 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభిస్తుంది.

బోన్సాయ్‌ల మొక్కల సాగు రైతుల ప్రకారం, మీరు ఒక హెక్టారులో 1500 నుంచి 2500 చెట్లను నాటవచ్చు. 3 x 2.5 మీటర్ల విస్తీర్ణంలో చెట్లను నాటితే ఒక హెక్టారులో దాదాపు 1500 చెట్లను నాటవచ్చు. మీకు కావాలంటే, మీరు రెండు మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో మరొక పంటను పండించవచ్చు. దీనివల్ల 4 ఏళ్లలో రూ.3 నుంచి 3.5 లక్షల వరకు రిటర్న్ వస్తుంది. ఇంకా ప్రతి సంవత్సరం రీప్లాంటేషన్ చేయవలసిన అవసరం అవసరం ఉండదు. ఎందుకంటే దీని వెదురు సుమారు 40 సంవత్సరాల పాటు ఉంటుంది.





























