- Telugu News Photo Gallery Now, Paytm users can make UPI payments to mobiles registered with third party UPI apps
Paytm: పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇక థర్డ్ పార్టీ యాప్‌కు సులభంగా మనీ ట్రాన్స్‌ఫర్
మనీ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సులభమైన పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. వివిధ యాప్స్ ద్వారా పేమెంట్స్‌ను చేసుకునే వెసులుబాటు ఉంది..
Updated on: Nov 22, 2022 | 11:51 AM

మనీ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సులభమైన పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. వివిధ యాప్స్ ద్వారా పేమెంట్స్‌ను చేసుకునే వెసులుబాటు ఉంది. మీ మొబైల్ నంబర్ నుంచి మీరు పేటీఎం ద్వారా ఇతర పేమెంట్స్ యాప్స్‌కు నేరుగా మనీ పంపుకొనే సదుపాయం తీసుకొచ్చిన పేటీఎం.

ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకే యాప్ లేకున్నా ఇప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయం పేటీఎం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేవలు పొందడానికి పేటీఎం యాప్‌లో 'యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్'లోకి వెళితే 'టూ యూపీఐ యాప్స్' విభాగం కనిపిస్తుంది.

మీరు ట్రాన్స్‌ఫర్ చేసే వ్యక్తి వాడే యాప్‌లోకి వెళ్లి ఆ వ్యక్తి మొబైల్ నంబర్ నమోదు చేయవచ్చు. 'పే నౌ' ఆప్షన్ టాప్ చేసి మీరు పంపాల్సిన మనీ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది.

ఇప్పటి వరకు వరకు యాప్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి కేవలం నాలుగు ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అందులో మొదటిది క్యూఆర్ కోడ్ స్కాన్, రెండవది యూపీఐ ఐడీ, ఫోన్ నంబర్ ఆధారంగా, డబ్బు బదిలీ చేయడానికి ఇద్దరు యూజర్లు ఒకే ప్లాట్‌ఫామ్ వాడుతుండాలి. బ్యాంకు ఖాతా వివరాల సాయంతో ఇతర యాప్స్‌కు పంపవచ్చు.

దేశీయంగా పేమెంట్స్ యాప్స్ ట్రాన్సాక్షన్లలో పేటీఎం మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఫోన్‌పే, రెండో స్థానంలో జీ-పే నిలిచాయి. దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా లావాదేవీలు నిరంతరాయంగా పెరుగుతున్నాయి.




