Subhash Goud |
Updated on: Nov 22, 2022 | 11:17 AM
టెలికం రంగంలో వివిధ నెట్‌వర్క్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తు్న్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీలు ధరలను పెంచుతూ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకువస్తున్నాయి.
ఇక భారతీ ఎయిర్‌టెల్ తమ కనీస నెలసరి రీచార్జ్ ప్లాన్ ధరను పెంచింది. రూ.99 విలువ కలిగిన 28 రోజుల మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్లాన్ రేటును దాదాపు 57 శాతం పెంచుతూ రూ.155గా మార్చింది.
అయితే ప్రస్తుతానికి హర్యానా, ఒడిషా టెలికం సర్కిళ్లకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయని సంస్థ వెబ్‌సైట్ ప్రకారం తెలుస్తున్నది.
కస్టమర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా త్వరలోనే దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే రూ.99 ప్లాన్‌లో 200 ఎంబీ డాటా ఉంటుంది. రూ.155 ప్లాన్‌లో 1జీబీకి పెరిగింది. అలాగే 300 ఎస్‌ఎంఎస్‌లూ లభిస్తాయి. మరోవైపు ఈ నిర్ణయంపై పంపిన సందేశానికి ఎయిర్‌టెల్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. గతంలో రూ.79 ప్లాన్ ధరను రూ.99గా మార్చినప్పుడూ ఇటువంటి పద్ధతినే అనురించింది ఎయిర్‌టెల్ కంపెనీ.