- Telugu News Photo Gallery Love Proposal Tips: are you going to express your love soon to your lover, then do not make these mistakes
Love Tips: ఇష్టమైన వారికి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా..? అయితే, ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..
ఏ జంట అయినా స్నేహం నుంచి మరో అడుగు వేసినప్పుడు.. ఒక భాగస్వామి ఆయన/ఆమె ప్రేమను ముందుగా వ్యక్తపరచాలని చాలా మంది ఆశిస్తారు. ప్రేమను వ్యక్తపరచడం వల్ల వారిద్దరి మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ఇంకా ఇద్దరినీ భావాలను లోతుగా అర్ధంచేసుకునేలా చేస్తుంది.
Updated on: Nov 22, 2022 | 1:11 PM

ప్రేమ అనేది ఒక మధురానుభూతి.. ప్రేమ.. లేదా వేరే వారితో సంబంధాన్ని సరైన మార్గంలో ప్రారంభించాలి. ఏ జంట అయినా స్నేహం నుంచి మరో అడుగు వేసినప్పుడు.. ఒక భాగస్వామి ఆయన/ఆమె ప్రేమను ముందుగా వ్యక్తపరచాలని చాలా మంది ఆశిస్తారు. ప్రేమను వ్యక్తపరచడం వల్ల వారిద్దరి మధ్య సంబంధం మరింత బలపడుతుంది. ఇంకా ఇద్దరినీ భావాలను లోతుగా అర్ధంచేసుకునేలా చేస్తుంది. మీరు మీ హృదయంలోని భావాలను నిజాయితీగా పంచుకుంటే.. భాగస్వామి కూడా మీ భావాలను ఖచ్చితంగా అంగీకరిస్తారు.

ముఖ్యంగా ఈ సమయంలో మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ప్రేమను సరైన మార్గంలో.. సరైన సమయంలో వ్యక్తపరచాలి. మరోవైపు, మీరు మొదటిసారి ప్రేమను వ్యక్తపరుస్తుంటే.. క్రష్ వెంటనే మీ ప్రేమను అంగీకరించడానికి ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మీ భాగస్వామికి ప్రపోజ్ చేస్తున్నప్పుడు, మీ ప్రేమ ప్రతిపాదనను స్వీకరించే వారు తిరస్కరించే అవకాశం ఉంది. కావున ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండండి.

తొందరపడకండి తమ ప్రేమను వ్యక్తపరిచే విషయంలో చాలాసార్లు హడావుడి చేస్తుంటారు. ఇది సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రేమను వ్యక్తపరచడంలో ఒకరికొకరికి బాగా తెలియదు. అటువంటి పరిస్థితిలో మీ క్రష్ మీ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించవచ్చు. అందుకే తొందరపడి ప్రేమను వ్యక్తం చేయకండి. ముందుగా మీరు ప్రేమించే వారి గురించి తెలుసుకుని, స్నేహాన్ని పెంపొందించుకోండి. ఆపై ఒక ప్రత్యేక సందర్భంలో ప్రపోజ్ చేయండి.

ముఖ్యంగా సందర్భం కోసం వేచి ఉండండి. ప్రేమను ప్రకటించడానికి ఒక ప్రత్యేక రోజుని ఎంచుకోండి. మీ ప్రేమను మరే రోజున వ్యక్తం చేయకూడదని దీని అర్థం కాదు.. కానీ ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాం. భాగస్వామి మానసిక స్థితి.. వాతావరణాన్ని అర్థం చేసుకోని ప్రేమను వ్యక్తపరిస్తే చాలా బాగుంటుంది.

భాగస్వామి మూడ్ సరిగా లేకపోతే.. ప్రేమ విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామి మూడ్ సరిగా లేనప్పుడు మీరు మీ ప్రేమను వ్యక్తపరిచినట్లయితే, వారు మీ ప్రేమను తిరస్కరించే అవకాశం ఉంది. హృదయానికి హత్తుకునేలా ప్రేమను వ్యక్తపరిస్తే.. వారి బంధం మరింత బలపడుతుంది.





























