- Telugu News Photo Gallery Cinema photos Heroines List who got successful films with Lady oriented stories
Tollywood: హీరోలకన్నా తామేమి తక్కువకాదని నిరూపిస్తున్న ముద్దుగుమ్మలు..
హీరోలతో సమానంగా రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నయనతార.
Updated on: Nov 22, 2022 | 1:44 PM

హీరోలేకాదు హీరోయిన్స్ కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నయనతార. లేడీఓరియేంటేడ్ సినిమాలతో ఈ అమ్మడికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.

నయన్ తర్వాత ఆ ప్లేస్ లో చెప్పుకోవాల్సింది అనుష్క పేరే. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో అనుష్క ప్రధానపాత్రలో నటించింది. లేడీ ఓరియెంట్ సినిమా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి, నిశ్శబ్దం లాంటి సినిమాల్లో నటించింది

ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష. ఈ మధ్య టాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. ఆ మధ్య కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన ఈ చిన్నది నాయకిలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.

ఇక నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తిసురేష్. ఆతర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, బ్యాడ్ లాక్ సఖి, చిన్ని లాంటి సినిమాలు చేసింది.

ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా యశోద సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా వచ్చిన యశోద హిట్ అయ్యింది. త్వరలో శాకుంతలం అనే సినిమాతో రాబోతుంది సామ్.

అందాల భామ సాయిపల్లవి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న సాయి పల్లవి. ఇటీవల గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హిట్ అందుకుంది.

అంజలి.. అటు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు సహాయక పాత్రలు కూడా చేస్తోంది. అలాగే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఏ ఏ భామ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.





























