-
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందు కిశోర్, సింహయాజీ స్వామిజీల ఫోన్ డేటాను విశ్లేషించగా.. ఈ ముగ్గురు బీజేపీ కీలక నేతలతో పాటు.. పలువురు రాజకీయ ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ కీలక నాయకులతో దిగిన ఫోటోలు కన్పించాయి. ఈ ఫోటోల ఆధారంగా సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఏ సందర్భాల్లో ఫోటోలు దిగారు. వారితో వీరికున్న సంబంధం ఏమిటి అనే దిశగా విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తో రామచంద్రభారతి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. దీని ఆధారంగా యోగితో రామచంద్ర భారతికి ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.
-
-
కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సింహయాజీ స్వామిజీ దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలు సింహయాజి స్వామిజీ ఫోన్లో లభించినట్లు తెలుస్తోంది. సింహయాజీ స్వామిజీకి పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే పలువురు కేంద్రమంత్రులతో ఆయన ఉన్న ఫోటోలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
-
-
సింహయాజీ స్వామిజి కేంద్ర పశుసంవర్థ శాఖ మంత్రి పరుషోత్తం రూపాలతో దిగిన ఫోటో బయటకు వచ్చింది. పురుషోత్తం రూపాలతో ఎటువంటి సంబంధాలున్నాయి. ఏ సందర్భంలో ఆయనను కలిశారు అనే దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, యోగా గురువు బాబా రాందేవ్‌తో ఉన్న ఫోటో కూడా ఒకటి విడుదలైంది. పలువురు కేంద్రమంత్రులు, ఆర్ఎస్ఎస్ నాయకులతో పాటు యోగా గురువు బాబా రాందేవ్ తో ఉన్న ఫోటో నేపథ్యంలో.. ఏ సందర్భంలో ఈ ఫోటో దిగారు, బాబా రాందేవ్‌తో యోగా శిక్షణలో కలిసి ఫోటో దిగారా, లేదా ప్రత్యేకమైన సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
-
ఆర్ఎస్ఎస్ సర్ కార్యవహ (జనరల్ సెక్రటరీ) దత్తాత్రేయ హోసబులేతో పాటు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుతో రామచంద్రభారతి దిగిన ఫోటో ఆధారంగా వారిద్దరు నేతలతో రామచంద్రభారతి పరిచయాలపై విచారణ చేస్తున్నారు. గత రెండు నెలల కాలంలో రామచంద్రభారతి ఎవరెవరిని కలిశారు. ఎవరితో మాట్లాడారు అనే దిశగా సిట్ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా నందకిశోర్ కేంద్రమంత్రి గడ్కరీతో దిగిన ఫోటో బయటకు వచ్చింది. నిందితులు ముగ్గురు కూడా బీజేపీకి చెందిన కీలక నేతలతో దిగిన ఫోటోలు ఉన్నాయి. గడ్కరీతో సింహయాజీ స్వామిజీ కూడా ఫోటో దిగారు. ఈ నేపథ్యంలో సింహయాజీ స్వామిజి, నందకిశోర్, రామచంద్రభారతిలకు ఎప్పటినుంచి పరిచయం ఉంది. వారు బీజేపీ కీలక నేతలను కలవడానికి గల కారణాలు ఏమిటనే దిశగా సిట్ చివారణ చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..