Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్తకు అంతా తెలుసులే తొందరగా వచ్చేయ్ ఎంజాయ్ చేద్దామని పిలిచింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది

కేరళ మలప్పురంలో జరిగిన సినీమాటిక్ రియల్ క్రైమ్ స్టోరీ అంతటా కలకలం రేపింది.. రషీదా, ఆమె భర్త నిషాద్.. ఇద్దరూ యూట్యూబర్లే. కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తారు. వీళ్లకు సోషల్ మీడియాలో మంచి పేరే ఉంది.

నా భర్తకు అంతా తెలుసులే తొందరగా వచ్చేయ్ ఎంజాయ్ చేద్దామని పిలిచింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది
Kerala Crime Story
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 22, 2022 | 10:49 AM

కేరళ మలప్పురంలో జరిగిన సినీమాటిక్ రియల్ క్రైమ్ స్టోరీ అంతటా కలకలం రేపింది.. రషీదా, ఆమె భర్త నిషాద్.. ఇద్దరూ యూట్యూబర్లే. కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తారు. వీళ్లకు సోషల్ మీడియాలో మంచి పేరే ఉంది. మంచి వ్లాగర్లుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. తెరవెనక వీళ్లిద్దరూ మహా ఖతర్నాక్‌లు. నయవంచనకు కేరాఫ్ అడ్రెస్‌.. అందుకే కేరళ పోలీసులు కిలాడీ దంపతులు ఇద్దర్నీ అరెస్టు చేశారు. వీళ్లు వేసిన హనీట్రాప్ స్కెచ్ కేరళలో కలకలం రేపింది. కిలాడీ యూట్యూబర్లను కేరళ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

త్వరగా డబ్బు సంపాదించేయాలి.. కోటీశ్వరులం అయిపోవాలి అని ఈ జంట అనుకుంది. కానీ యూట్యూబ్ అంత మనీ ఇవ్వట్లేదు. ఏం చేసినా వేలల్లో తప్ప లక్షల్లో రావట్లేదు. సరైన మార్గంలో వెళ్తే ఇలాగే ఉంటుందనుకున్న వీళ్లిద్దరూ ఓ స్కెచ్ వేశారు. కాస్త డబ్బు ఉండి.. ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న ఓ 68 ఏళ్ల బిజినెస్‌మెన్ అయిన వృద్ధుడిని ఎంచుకున్నారు. ఆ తర్వాత డ్రామా మొదలైంది. రషీదా ఆ వృద్ధుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. అసలే మహిళ.. అందంగా ఉండటంతో ఓకే చేశాడు. ఇంకేముంది అసలు కథ మొదలైంది.

2021 జులైలో అతనితో పరిచయం పెంచుకున్న రషీదా చాటింగ్ మొదలుపెట్టింది. తర్వాత నువ్వంటే ఇష్టం అంది. ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచింది. ముసలాయన ఆమె ట్రాప్‌లో పడ్డాడు. ఓ రోజు అలువాలోని తన ఫ్లాట్‌కి రమ్మంది. ఇదంతా తన భర్తకు తెలుసనీ.. అతని సమ్మతితోనే చేస్తున్నానని చెప్పింది. నిజమే అనుకుని వెళ్లాడు. సీక్రెట్ కెమెరాలు పెట్టి అతనితో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంది రషీదా..

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఇద్దరు కలిసి బ్లాక్‌మెయిల్ మొదలుపెట్టారు. తమకు డబ్బు ఇవ్వకపోతే వీడియోని కుటుంబ సభ్యులకు చూపిస్తామని బెదిరించారు. దాంతో ముసలాయన అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా సంవత్సర కాలంలో 23 లక్షలు దోచేశారు. ఆ పెద్దాయన మూడీగా ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. మనీ ఏం చేస్తున్నారని నిలదీస్తే అసలు నిజం చెప్పేశాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో అతని కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో కన్నింగ్ జంట కుట్రకు బ్రేక్ పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..