Mohali: అది మొహాలీలోని ఓ వివాహ వేడుక.. అంతలోనే అక్కడకు వరుడి ప్రియురాలు వచ్చి..
పెళ్లి పీటల మీద ఉన్న వరుడు తన ప్రేమికుడని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు మోసం చేశాడని ఇద్దరు పిల్లల తల్లి మొహాలీలోని ఓ వివాహ వేదిక వద్దకు వచ్చి ..
పెళ్లి పీటల మీద ఉన్న వరుడు తన ప్రేమికుడని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు మోసం చేశాడని ఇద్దరు పిల్లల తల్లి మొహాలీలోని ఓ వివాహ వేదిక వద్దకు వచ్చి హంగామా చేసింది. తాము అల్లుడిగా తెచ్చుకున్న వ్యక్తికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. పాటియాలాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి తనను వరుడు మోసం చేశాడని ఆరోపిస్తూ.. తాము ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నామని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సిర్హింద్ గ్రామానికి చెందిన సదరు వరుడిని మాటౌర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
“నా భర్తతో విడాకుల కోసం నేను ఇప్పటికే దాఖలు చేసి ఉన్నాను. ఇంకా నేను అతనితో (వరుడు) దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాను. అతను నా పిల్లలతో కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఇప్పుడు అతను వివాహం చేసుకుంటున్నాడు. దీని గురించి నాకు ఎలాంటి సమాచారం నాకు చెప్పలేదు” అని ఈ మహిళ తన ఫిర్యాదు ద్వారా తెలిపింది. అయితే దీనిపై వరుడు..‘‘మహిళ తన వైవాహిక స్థితి గురించి నాకు తెలియకుండా దాచిపెట్టింది. తన భర్తకు ఇంకా విడాకులు ఇవ్వలేదని ఆమె నాకు చెప్పలేదు. ఆమె నాకు అబద్ధం చెప్పింది. అందువల్ల నేను మరొకరితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను”అని అతను పోలీసులకు చెప్పాడు.
వరుడు చెప్పిన దాని ప్రకారం.. మొత్తం సమాచారం తెలుసుకున్నవధువు తల్లిదండ్రులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. అంతేకాక వివాహ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని వరుడు భరించాలని వారు కోరారు. కాగా. ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మాటౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నవీన్ పాల్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..