Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్‌కు బ్రేకులు..కారణం ఏమిటంటే..?
ప్రపంచ కుబేరులలో ఒకరు, టెల్సా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక తన వశమైన ప్లాట్‌ఫారమ్‌లో..
ప్రపంచ కుబేరులలో ఒకరు, టెల్సా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక తన వశమైన ప్లాట్‌ఫారమ్‌లో అనేక మార్పులను చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన ఈ పాటికే ప్రకటించారు. అదే క్రమంలో ఫేక్ ఖాతాలను సమర్థవంతంగా తొలగించేందుకు.. ఒరిజనల్ అకౌంట్లుగా నిర్థారించినవారి ఖాతాలకే బ్లూ టిక్ ఇస్తానని తెలిపారు. అందుకు బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్‌ని చేసుకోవాలి ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే తాజాగా దానిని పునఃప్రారంభించడాన్ని నిలిపివేసినట్లు ట్విట్టర్ తన అకౌంట్ ద్వారా ఓ ట్వీట్ చేసి తెలిపారు. “బ్లూ వెరిఫికేషన్ రీలాంచ్‌ను ఆపివేయడం వల్ల ఫేక్ అకౌంట్ల తొలగింపును ఆపివేస్తామన్న విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. బహుశా వేర్వేరు రంగుల తనిఖీ వ్యక్తుల కంటే సంస్థల కోసం బాగా ఉపకరిస్తుంది” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే దీనిని ఎప్పుడు తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తున్నారనేది ప్రకటించలేదు. నిషేధించిన ఖాతాలలో కొన్నింటిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినందున.. ఖాతా సస్పెన్షన్‌లు, అభ్యంతరకరమైన ట్వీట్‌లను పరిమితం చేసే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కొత్త విధానం గురించి మస్క్ శనివారం వెల్లడించారు. “కొత్త ట్విట్టర్ విధానం వాక్ స్వాతంత్య్రం. కానీ అభ్యంతరకరమైన/ద్వేషపూరితమైన ట్వీట్లు గరిష్టంగా డీబూస్ట్, డీమోనిటైజేషన్‌లో ఉంటాయి. కాబట్టి ట్విట్టర్‌కి ప్రకటనలు లేదా ఇతర ఆదాయం ఉండదు. మీరు ట్వీట్‌ని ప్రత్యేకంగా వెతికితే తప్ప మీరు దాన్ని కనుగొనలేరు. ఇది మిగిలిన ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే భిన్నంగా లేదు”అని ఎలాన్ మస్క్ తన ట్వీట్ రాసుకొచ్చారు.
Holding off relaunch of Blue Verified until there is high confidence of stopping impersonation.
Will probably use different color check for organizations than individuals.
— Elon Musk (@elonmusk) November 22, 2022
కాగా, నవంబర్ నెల ప్రారంభంలో, మార్క్వెస్ బ్రౌన్లీ వంటి కొందరు సాంకేతిక సమీక్షకులు ఎలాన్ మస్క్ విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఎలాన్ మస్క్ విధానాలపై ఆందోళన చెందుతున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఖాతాలను ధృవీకరించాలనుకుంటే, ఎవరూ అందరి ఖాతాలను ధృవీకరించలేరు’’ అని బ్రౌన్లీ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ ధృవీకరణను చెల్లింపు ఫీచర్‌గా మార్చాలనే నిర్ణయాన్ని ఆయన విమర్శించారు. ఎలోన్ మస్క్ వాస్తవానికి స్వేచ్ఛా ప్రసంగం గురించి లేదా ట్విట్టర్‌లోని బొట్ సమస్యకు పరిష్కారం గురించి పట్టించుకోరని చాలా మంది యూజర్లు అంటున్నారు.