Pune Girl Molestation: దుర్మార్గానికి పరాకాష్ట.. బాలికపై తండ్రి, మామ, తాత అఘాయిత్యం..! ఛీ వీళ్ళు అసలు మనుషులేనా..
నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఓ దారుణం వెలుగులోకి వచ్చింది.
నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, మామ ముక్కుపచ్చలారని బాలికపై అఘాయిత్యానికి ఒడిగటంట్టారు. వావి వరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తించారు. పలు సందర్భాల్లో తండ్రితోపాటు ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చి పుణెలో నివాసం ఉంటోన్న 17 ఏళ్ల బాలిక.. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో షాకయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక.. ప్రస్తుతం చదువుతున్న కళాశాలలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు.. తన ఆవేదన వెళ్లబోసుకుంది. తన గోడును వారికి వినిపించడంతో.. తన జీవితంలో జరిగిన భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను సొంతూరులో ఉన్న సమయంలో.. తన మామ, తాత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పుణే వచ్చిన తర్వాత ఈ దారుణ ఘటనల గురించి తన తండ్రికి ఓ చీటీలో రాసి ఇచ్చానని తెలిపింది. వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా.. తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించింది. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

