AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Jihad: శ్రద్ద హత్య లవ్‌ జీహాద్‌ కాదు.. ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్యగానే చూడాలన్న ఓవైసీ

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రియాక్టయ్యారు.. ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఇది లవ్‌ జిహాద్‌ ఘటన కానేకాదన్నారు.

Love Jihad: శ్రద్ద హత్య లవ్‌ జీహాద్‌ కాదు.. ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్యగానే చూడాలన్న ఓవైసీ
Shraddha Walker
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2022 | 8:08 AM

దేశవ్యాప్తంగా ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు కొంతమంది ఈ హత్యను లవ్ జీహాద్ గా చెబుతున్నారు. ఢిల్లీలో 36 ముక్కలు చేసిన శ్రద్ధా వాకర్‌ హత్య లవ్‌ జీహాద్‌ అని దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి.. కానీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం ఇది లవ్ జీహాద్‌ కాదంటున్నారు. అసోం ముఖ్యమంత్రి బిస్వాశర్మ మాత్రం..ముమ్మాటికీ ఇది లవ్‌ జీహాదే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన దారుణమైన హత్య లవ్‌ జీహాదేనా..? ఇదే ఇప్పుడు దేశమంతా చర్చ..శ్రద్దా ఫాదర్ కూడా మొదట్లో తన కూతురి హత్య లవ్‌ జీహాదే అన్నారు.

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యోదంతంపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రియాక్టయ్యారు.. ఈ కేసుకు మతం రంగు పులమడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఇది లవ్‌ జిహాద్‌ ఘటన కానేకాదన్నారు. బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. ఇది లవ్ జీహాద్ సమస్య కాదని ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్య అని దీన్ని అందరూ ఖండిచాలని ఓవైసీ అన్నారు. అంతేకాదు ఈ ఘటనను బీజేపీ ను రాజకీయంగా వాడుకుంటోందని.. ఈ కేసుకు మతం రంగు పులిమారని ఘాటుగా వ్యాఖ్యానించారు ఓవైసీ. మొత్తానికి శ్రద్దా హత్యను మత కోణంలో బీజేపీ చూస్తోంది. బీజేపీ రాజకీయాలు పూర్తిగా తప్పు. ఇది లవ్ జిహాద్ ఘటన కాదు. కానీ.. ఒక మహిళపై హేయనీయంగా ప్రవర్తించడం, వేధించడం.. దాడికి సంబంధించింది. ఆ కోణంలోనే ఈ కేసును చూడాలని ఓవైసీ చెప్పారు.

అత్యంత దుర్మార్గంగా శ్రద్దా వాకర్ ను హత్య చేసి ఆమె శరీరాన్ని 36 ముక్కలుగా చేసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసిన ఆఫ్తాబ్ పై దేశ‌మంతా ఆగ్రహంతో రగిలిపోతోంది. శ్రద్దకు నివాళులు అర్పిస్తూ ఆఫ్తాబ్ ను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా అనేక చోట్ల పలు మహిళా, హక్కుల సంఘాలు సమావేశాలు కూడా ఏర్పాటు చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..