Rat Murder: ఎలుకను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలుక డెడ్ బాడీకి పోస్టుమార్టం.. ఎక్కడంటే
ఒక ఎలుకను చంపినందుకు ఎవరినైనా అరెస్టు చేయడం చూశారా.. ఎప్పుడైనా ఎటువంటి సంఘటన గురించి మీరు విన్నారా.. ప్రస్తుతం ఈ హత్య కు సంబంధించిన ఓ వార్త బదౌన్‌లో చర్చనీయాంశంగా మారింది.
హత్య చేసినా, హత్య చేసే విధంగా ప్రోత్సహించినా అది చట్టరీత్యా నేరం. అయితే కొన్ని కేసులు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. మీరు రోడ్డు మీద వెళుతున్నారనుకోండి.. అక్కడ ఒక హత్య జరుగుతుంటే.. మీరు ఏమి చేస్తారు? మనకు ఎందుకు ఈ గొడవ అని కొందరు అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతారు. మరి కొందరు వ్యక్తులు కొంచెం ధైర్యం చేసి దుండగులను ఎదిరించి.. అవతలివారిని కాపాడాలని ప్రయత్నిస్తారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకున్న ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. హత్య గురించి తెలిసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మనుషులను లేదా జంతువులను హత్య చేస్తే.. నిందితులను అరెస్టు చేయడం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒక ఎలుకను చంపినందుకు ఎవరినైనా అరెస్టు చేయడం చూశారా.. ఎప్పుడైనా ఎటువంటి సంఘటన గురించి మీరు విన్నారా.. ప్రస్తుతం ఈ హత్య కు సంబంధించిన ఓ వార్త బదౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. విశేషమేమిటంటే.. చనిపోయిన ఎలుకకు పోస్టుమార్టం కూడా పోలీసులే చేయించారు.
వీడియో చూడండి:
चूहे की हत्या के आरोप में युवक गिरफ्तार, पत्थर में बांधकर नाले में फेंका था | Unseen India pic.twitter.com/akBOCIBR8R
— UnSeen India (@USIndia_) November 25, 2022
మీడియా కథనాల ప్రకారం.. రోడ్డు పక్కన కల్వర్టుపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కూర్చున్నాడు. తన సమీపంలో వెళ్తున్న ఓ ఎలుకను పట్టుకున్నాడు. ఆపై ఎలుక తోకకు రాయి కట్టి కాలువలో పడేశాడు. ఆ సమయంలో వికేంద్ర శర్మ అనే వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఎలుకకు రాయి కడుతున్న వ్యక్తిని అలా చేయకుండా ఆపాడు. అయితే ఆ వ్యక్తి వికేంద్ర శర్మ చెప్పిన మాటలను వినలేదు.. అతని కళ్ల ముందే ఎలుకను కాలువలోకి విసిరాడు. వెంటనే స్పందించిన వికేంద్ర శర్మ ఆ ఎలుకను మురికి కాలువలో నుంచి బయటకు తీశాడు. అయితే అప్పటికే ఆ ఎలుక చనిపోయింది.
దీంతో వికేంద్ర శర్మకి కోపం వచ్చి.. నిందితుడు మనోజ్ కుమార్ ను ‘ఎలుకను ఎందుకు చంపావు’ అనిప్రశ్నించాడు. మనోజ్ వెంటనే నేను ఎలుకలను ఇలా చంపేస్తానని.. వాటిని చంపుతూనే ఉంటానని.. నీకు దమ్ముంటే ఏమి కావాలంటే అది చేసుకో అని చెప్పాడు. మనోజ్ చెప్పిన మాటలతో కోపం వచ్చిన వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించాలని, నిందితుడిపై జంతు హింస చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బదౌన్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘చనిపోయిన ఎలుకను పోస్ట్ మార్టం కోసం.. బదౌన్‌లోని వెటర్నరీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కు పంపినట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..