AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ఆస్ట్రేలియాలో యువతిని హత్య చేశాడు.. ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..

ఆస్ట్రేలియాలో ఓ మహిళను దారుణంగా చంపాడు.. అనంతరం భారతదేశానికి పారిపోయి వచ్చాడు.. నాలుగేళ్లు గడిచినా.. నిందితుడు ఆచూకీ లభించకపోవడంతో.. ఆస్ట్రేలియా పోలీసులు భారీ రివార్డును సైతం ప్రకటించారు.

Crime News: ఆస్ట్రేలియాలో యువతిని హత్య చేశాడు.. ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే..
Indian Man Killed Australian Woman
Shaik Madar Saheb
|

Updated on: Nov 26, 2022 | 12:03 PM

Share

Indian Man Killed Australian Woman: ఆస్ట్రేలియాలో ఓ మహిళను దారుణంగా చంపాడు.. అనంతరం భారతదేశానికి పారిపోయి వచ్చాడు.. నాలుగేళ్లు గడిచినా.. నిందితుడు ఆచూకీ లభించకపోవడంతో.. ఆస్ట్రేలియా పోలీసులు భారీ రివార్డును సైతం ప్రకటించారు. 2018లో ఆస్ట్రేలియాతోపాటు భారత్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసును ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆస్ట్రేలియాలో మహిళను హత్యచేసి భారత్ కు పారిపోయి వచ్చిన నిందితుడ్ని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ హత్య కేసులో పంజాబ్ కు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సింగ్‌ అసిస్టెంట్‌ రాజ్‌విందర్‌ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉద్యోగం చేస్తున్న రాజ్ విందర్ సింగ్.. 2018 అక్టోబర్ 21న తోయా కార్డింగ్లే (24) అనే ఫార్మసీ ఉద్యోగిని హత్య చేశాడు. క్వీన్స్‌లాండ్‌ బీచ్‌కు వాకింగ్‌కు వెళ్లిన ఫార్మాసి ఉద్యోగిని కార్డింగ్లే కనిపించకుండాపోయింది. తర్వాత రోజు వాంగెట్టి బీచ్‌లో ఆమె మృతదేహం దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్డింగ్లేను రాజ్‌విందర్ హత్య చేశాడని ఆస్ట్రేలియా పోలీసులు నిర్థారించారు. రాజ్‌విందర్ సింగ్.. 24 ఏళ్ల తోయా కార్డింగ్‌లీని కుక్క మొరగడం వల్లే ఈ హత్య జరిగిందని నిర్ధారించారు. ఇద్దరిమధ్య ఘర్షణ అనంతరం కత్తితో దాడిచేసి చంపాడని పేర్కొన్నారు. మహిళ హత్య అనంతరం కేసు నమోదు చేశారు.

అయితే, హత్య చేసి రెండు రోజుల తర్వాత కుటుంబం, ఉద్యోగం అన్నింటిని వదిలేసి నిందితుడు రాజ్‌ విందర్ సింగ్ భారత్‌కు పారిపోయివచ్చాడు. ఎంత వెతికిన నిందితుడు కనపించకపోవడంతో.. అతడి ఆచూకీ కోసం.. ఆస్ట్రేలియా పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ ప్రకటించిన వారికి 1 మిలియన్ డాలర్ల భారీ నజరానా ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే ఇది అత్యంత భారీ రివార్డు. ఫార్మాసి ఉద్యోగిని కార్డింగ్లే 2018, అక్టోబర్ 21న కనిపించకుండాపోయింది. తర్వాత రోజు వాంగెట్టి బీచ్‌లో ఆమె మృతదేహం దొరికింది. చివరకు భారత్ లో ఉన్నాడని తెలుసుకున్నారు.

నిందితుడు రాజ్‌విందర్ సింగ్ ను తిరిగి రప్పించేందుకు గత ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతదేశానికి అభ్యర్థన సైతం చేసింది. నవంబర్‌లో ఆమోదం లభించగా.. నిన్న నిందితుడు రాజ్‌విందర్ సింగ్ ను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఢిల్లీ కోర్టు రాజ్‌విందర్ సింగ్‌ను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఇవి కూడా చదవండి

ఇంటర్‌పోల్‌ నోడల్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా అధికారులు పంచుకున్న ఇన్‌పుట్‌ల ఆధారంగా నిందితుడిని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ GT కర్నాల్ రోడ్ సమీపంలో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడిని ఆస్ట్రేలియా తరలిస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..