AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UIDAI Updates: ఆధార్ కీలక నిర్ణయం.. బాల్ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి.. ఇలా అప్‌డేట్ చేసుకోండి..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) బాల్ ఆధార్/ పిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సూచనలు జారీ చేసింది. 5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు..

UIDAI Updates: ఆధార్ కీలక నిర్ణయం.. బాల్ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి.. ఇలా అప్‌డేట్ చేసుకోండి..
Aadhaar Card
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2022 | 1:44 PM

Share

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) బాల్ ఆధార్/ పిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సూచనలు జారీ చేసింది. 5 నుంచి 15 సంవత్సరాలు నిండిన పిల్లలకు, ఆధార్ రికార్డులలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని యూఐడీఏఐ ట్విట్టర్‌లో ప్రకటించింది. అంతేకాదు.. బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్లు మారవని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్‌ కార్డ్‌ను అప్లై చేయడానికి, పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.

రెండుసార్లు అప్‌డేట్ తప్పనిసరి..

పిల్లల ఆధార్‌ కార్డుకు రెండుసార్లు బయోమెట్రిక్ అప్‌డేట్‌లు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది UIDAI. పిల్లలకు 5 ఏళ్లు వచ్చినప్పుడు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. రెండవది 15 ఏళ్లు వచ్చినప్పుడు చేయాలి. చిన్న పిల్లలకు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు వంటి బయోమెట్రిక్ డేటాను చేర్చరు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో బయోమెట్రిక్‌కు అవసరమైన ఐరిష్, చేతి ముద్రలు అభివృద్ధి చెందవు. ఆ కారణంగా బయోమెట్రిక్ అవసరం లేదని గతంలోనే UIDAI ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల తరువాత వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. లేదంటే వారి ఆధార్ కార్డ్ చెల్లదు.

ఇవి కూడా చదవండి

బాల్ ఆధార్ కార్డ్‌ని ఈ విధంగా అప్‌డేట్ చేయండి..

1. UIDAI- uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

3. పిల్లల పేరు, సంరక్షకుని ఫోన్ నంబర్, బిడ్డ, అతని/ఆమె తల్లిదండ్రుల గురించి అడిగిన ఇతర బయోమెట్రిక్ సమాచారం వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.

4. నివాస చిరునామా, రాష్ట్రం, పిల్లలకు సంబంధించి ఇతర వివరాలను నమోదు చేయాలి.

5. అన్ని వివరాలను ఒకసారి చూసుకున్న తరువాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

6. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ చేయడానికి అపాయింట్‌మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

7. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పుట్టిన తేదీ, రిఫరెన్స్ నంబర్ వంటి అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు ప్రక్రియను ట్రాక్ చేయడానికి రసీదు సంఖ్యను అందించే ఆధార్ ఎగ్జిక్యూటివ్ ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది.

8. 60 రోజులలోపు నమోదిత పిల్లల చిరునామాకు ఆధార్ కార్డ్ పోస్ట్ చేయడం జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..