AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constitution Day: రాజ్యాంగమే పరమావధి.. ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన మార్గమిదే..

ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పలు కీలక అంశాల గురించి (Modi Archive) ట్విట్టర్‌లో షేర్ చేశారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న నాటినుంచి.. ప్రధానమంత్రి అయ్యే వరకు తాను భారత రాజ్యాంగ స్ఫూర్తితో అనుసరించిన పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు.

Constitution Day: రాజ్యాంగమే పరమావధి.. ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన మార్గమిదే..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Nov 26, 2022 | 11:28 AM

Share

PM Modi – Constitution Day: భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కష్టం.. ఇది ఎవరో అన్న మాట కాదు.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించిన మాటలివి.. 2021 రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని.. అదే ఫైనల్ అంటూ పేర్కొనడం.. భారత రాజ్యాంగం పట్ల ఆయనకున్న మేథో శక్తి, విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పలు కీలక అంశాల గురించి (Modi Archive) ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రధాని మోడీ.. గుజరాత్ సీఎంగా ఉన్న నాటినుంచి.. ప్రధానమంత్రి అయ్యే వరకు తాను భారత రాజ్యాంగ స్ఫూర్తితో అనుసరించిన పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించిన జ్ఞాపకార్థంగా.. 2015 నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం నిర్వహిస్తోంది. బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని 2015లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం.. ఈ రోజును రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఈ రోజును లా డేగా పాటించేవారు. అయితే, ప్రధాని మోడీ తాజాగా.. మోడీ ఆర్కైవ్ లో షేర్ చేసిన అంశాలు.. ఆయనకు భారత రాజ్యాంగంపై ఉన్న మక్కువ.. దార్శనికతకు ఈ కార్యక్రమాలు అద్దంపడుతున్నాయి.

మోడీ ఆర్కైవ్ షేర్ చేసిన ట్విట్లు ..

భారత రాజ్యాంగం రచించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ.. 1999లో చేతిరాతతో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. “రాజ్యాంగానికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. మన కర్తవ్యం లేదా మన హక్కులు దేశాన్ని ముందుకు నడిపించగలవా..? అనే దానిపై దేశవ్యాప్త చర్చ అవసరం. రాబోయే శతాబ్దంలో దేశ నిర్మాణం ఒక ప్రజా ఉద్యమంగా ఎలా మారుతుంది?” అనే అంశాలపై చేతితో స్వయంగా రాసిన పేజీలను ఆయన షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

రాజ్యాంగం ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 2010లో అప్పటి సిఎం మోడీ సంవిధాన్ గౌరవ్ యాత్రను నిర్వహించారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ఏనుగుపై ఉన్న రాజ్యాంగానికి సంబంధించిన భారీ ప్రతిరూపంతో కూడిన చారిత్రాత్మక ర్యాలీని ఆయన నిర్వహించారు.

2011లో అప్పటి గుజరాత్ సీఎం మోదీ ‘భారత్ ను సంవిధాన్’ – భారత రాజ్యాంగానికి గుజరాతీ వెర్షన్‌ను విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని స్థానిక భాషలో ప్రచురించడం వల్ల ప్రజలు దేశ చట్టాలను బాగా అర్థం చేసుకోవడంలో, దాని స్ఫూర్తిని తెలియజేయడంలో సహాయపడతాయని మోదీ విశ్వసించారు.

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఆమోదించినందుకు గౌరవసూచకంగా 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని పీఎం మోడీ నాయకత్వంలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ కాన్‌స్టిట్యూషన్ హాల్ & గ్యాలరీలో భారత రాజ్యాంగానికి సంబంధించిన కీలక అంశాలను చిత్రాలను కూడా ప్రదర్శిస్తోంది.

2019లో రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు ప్రధాని మోడీ.. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగానికి నమస్కరించి బాధ్యతలు స్వీకరించారు.

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..