AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constitution Day: రాజ్యాంగ దినోత్సవ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ఏమన్నారంటే..?

భారతదేశం శనివారం రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) నేపథ్యంతో సుప్రీంకోర్టులో  జరుగుతున్న రాజ్యాంగ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని..

Constitution Day: రాజ్యాంగ దినోత్సవ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ఏమన్నారంటే..?
Constitution Day
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 26, 2022 | 11:48 AM

Share

భారతదేశం శనివారం రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) నేపథ్యంతో సుప్రీంకోర్టులో  జరుగుతున్న రాజ్యాంగ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని మనందరికీ అందించిన మహనీయులందరినీ తలచుకొని నివాళులు అర్పించారు. ఇంకా 2008 ముంబై ఉగ్రదాడులను ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రపంచ దేశాల దృష్టి ప్రస్తుతం భారత్ వైపే ఉండని దానికి కారణం మన రాజ్యాంగం మనకు అందించిన స్ఫుర్తే కారణమని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘‘ఈ రోజు మన దేశం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్న కారణంగా రాజ్యాంగ నిర్మాత బాబా అంబేద్కర్‌కి, ఇంకా మనకు రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వ్యక్తులందరికీ నివాళులు అర్పించి, మన దేశం కోసం వారి దార్శనికతను నెరవేర్చడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2008 ముంబై ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటూ..‘ఉగ్రవాదులు – మానవాళికి శత్రువులు’ అని పేర్కొంటూ ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి

ఇంకా ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉంది. భారతదేశం యొక్క వేగవంతమైన అభివృద్ధి, వేగంగా పురోగతి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ, బలపడుతున్న గ్లోబల్ ఇమేజ్ కారణంగా ప్రపంచం మన వైపు గొప్ప అంచనాలతో చూస్తోంది’’ అని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరన్ రిజీజు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు యూయూ లలిత్, ఎన్వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా, 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం.. 2015 నుంచి (నవంబర్ 26న) కేంద్ర ప్రభుత్వం ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి రాజ్యాంగ వేడుకలను నిర్వహిస్తోంది. అంతకుముందు ఈ రోజును లా డేగా పాటించేవారు.