BECIL Recruitment: ఐదో తరగతి/టెన్త్/డిగ్రీ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 72 ఫార్మకోపోయియా అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్, టెక్నికల్ డేటా అసోసియేట్, డ్రైవర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 72 ఫార్మకోపోయియా అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్, టెక్నికల్ డేటా అసోసియేట్, డ్రైవర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏ విధమైన అర్హతలుండాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి ఐదో తరగతి, పదో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ, కెమిస్ట్రీ/ఫార్మకాగ్నసీ/బోటనీ/ఫార్మీసీ స్పెషలైజేషన్‌లో పీజ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 5, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.590, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్ధులు రూ.354లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 10 (ఆదివారం) కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు అభ్యర్ధులు హాజరుకావల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.16,425ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
COMMITTEE ROOM, ADMINISTRATIVE BLOCK, PHARMACOPOEIA COMMISSION FOR INDIAN MEDICINE & HOMOEOPATHY (PCIM&H), MINISTRY OF AYUSH, KAMLA NEHRU NAGAR, GHAZIABAD, UTTAR PRADESH – 201002.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.