Shraddha Murder Case: అఫ్తాబ్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు.. జైలుకి తరలిస్తున్న వ్యాన్‌పై కత్తులతో దాడి..

కోర్టు అనుమతితో సోమవారం నాల్గవ దశ పాలిగ్రఫీ పరీక్ష ను నిర్వహించారు. పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి జైలుకు అఫ్తాబ్‌ను తీసుకెళ్తున్న వాహనంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.

Shraddha Murder Case: అఫ్తాబ్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు.. జైలుకి తరలిస్తున్న వ్యాన్‌పై కత్తులతో దాడి..
Shraddha murder accused Aaftab
Follow us

|

Updated on: Nov 28, 2022 | 7:39 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ కేసుని ఢిల్లీ పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా ప్రయాణిస్తున్న వ్యాన్‌పై ఢిల్లీలోని రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ వెలుపల దాడి జరిగింది. అంబేద్కర్ ఆసుపత్రిలో పాలిగ్రాఫ్‌ పరీక్ష ముగిసిన అనంతరం అఫ్తాబ్‌ను జైలుకి తరలిస్తున్న సందర్భంగా జైలు వ్యాన్‌పై దాడి చేసినట్లు సమాచారం. శ్రద్ధా హత్య కేసులోని నిందితుడు అఫ్తాబ్.. పోలీసుల విచారణలో రకరకాల సమాధానాలు చెబుతూ పోలీసులను నిత్యం గందరగోళానికి గురిచేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో పోలీసులు నార్కో , పాలిగ్రఫీ పరీక్ష కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో సోమవారం నాల్గవ దశ పాలిగ్రఫీ పరీక్ష ను నిర్వహించారు. పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి జైలుకు అఫ్తాబ్‌ను తీసుకెళ్తున్న వాహనంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

అఫ్తాబ్‌ పాలిగ్రాఫ్‌ పరీక్ష జరుగుతున్న సమయంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ కార్యాలయం ఎదుట కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి అఫ్తాబ్‌తో వెళ్తున్న వ్యాన్‌పై దాడి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, దాడి చేసిన వారి సంఖ్య 4 నుండి 5 వరకు ఉన్నట్లు  తెలుస్తోంది.  వెంటనే పోలీసులు పరిస్థితిని నియంత్రణలోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిలో ఒకరు శ్రద్ధకు న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..