Mushrooms: ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులు తినొచ్చా? తినకూడదా?

మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, పానియాలు ఎక్కువగా తీసుకుంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఐతే పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ప్రెగ్నెనెంట్‌ మహిళలు తినవచ్చా? లేదా? అనే సందేహం చాలా..

Mushrooms: ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులు తినొచ్చా? తినకూడదా?
mushrooms for pregnant women
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2022 | 12:51 PM

మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, పానియాలు ఎక్కువగా తీసుకుంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఐతే పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ప్రెగ్నెనెంట్‌ మహిళలు తినవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారంటే.. పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. గర్భిణీ మహిళలు వీటిని ఆహారంగా తీసుకుంటే ఇమ్యునిటీ శక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పుట్టగొడుగులు ముందంజలో ఉంటాయి. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులను తినవచ్చు. ఐతే ఇవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ఏయే జాగ్రత్తలు తీసుకోవాలంటే..

Mushrooms For Pregnant Wome

mushrooms for pregnant women

  • మార్కెట్లో ఎన్నో రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో పారాసోల్ పుట్టగొడుగులు, ఫాల్స్ మోరల్స్
  • పుట్టగొడుగులను మాత్రం అస్సలు తినకూడదు.
  • పుట్టగొడుగులను ఎప్పుడూ పరిమిత మోతాదులో మాత్రమే తినాలి.
  • పుట్టగొడుగులను నీళ్లతో బాగా శుభ్రం చేసి, ఉడికించి తినాలి. పచ్చిగా అస్సలు తినకూడదు.
  • పుట్టగొడుగులను తాజాగా ఉన్నప్పుడే తినాలి. నిల్వ ఉన్న వాటిల్లో పురుగులు చేరుతాయి.
  • పుట్టగొడుగులను తినాలనుకున్నప్పుడు ఓ సారి వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు. డాక్టర్ సలహా మేరకు
  • తింటే గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుంది.
  • పుట్టగొడుగులను తినేటప్పుడు, తిన్న తర్వాత ఏదైనా సమస్య తలెత్తితే, వెంటనే ఆపుచేయడం మంచిది.

మరిన్ని తాజా ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.