- Telugu News Photo Gallery Viral photos This 4 Countries are Best Places for Chocolate Lovers in the World
Chocolate: చాక్లెట్ క్యాపిటల్ ఎక్కడుందో తెలుసా?.. చాక్లెట్ లవర్స్ ఈ విషయాలు తెలుసుకోకపోతే ఎలా..
మీకు చాక్లెట్ అంటే ఇష్టమా? ఐతే మీరు ఈ దేశాల గురించి తప్పక తెలుసుకోవాలి. చాక్లెట్‌కు ప్రసిద్ధి చెందిన ఈ దేశాలను ఒక్కసారైనా చుట్టివస్తే ఆ మజానే వేరు..
Updated on: Nov 29, 2022 | 12:15 PM

మీకు చాక్లెట్ అంటే ఇష్టమా? ఐతే మీరు ఈ దేశాల గురించి తప్పక తెలుసుకోవాలి. చాక్లెట్‌కు ప్రసిద్ధి చెందిన ఈ దేశాలను ఒక్కసారైనా చుట్టివస్తే ఆ మజానే వేరు..

హెర్షీ చాక్లెట్ పేరు వినే ఉంటారు. ఇది బ్రాండ్ మాత్రమే కాదు. అమెరికాలో దీని పేరు మీద ఓ సిటీ కూడా ఉంది. దీనిని భూమిపై అత్యంత స్వీటెస్ట్ ఏరియాగా పిలుస్తారు.

అత్యధిక చాక్లెట్లను ఉత్పత్తి చేసే దేశం స్విట్జర్లాండ్. లిండ్ట్ అండ్ స్ప్రంగ్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే చాక్లెట్లకు ప్రపంచంలోనే అత్యంత మధురమైన చాక్లెట్లుగా పేరుగాంచాయి. రెండో ప్రసిద్ధ చాక్లెట్ కంపెనీ మైసన్ కెల్లర్. దీనిని నెస్లే ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తారు.

మెక్సికో వెళ్లిన వారు ఇక్కడ మాయన్ స్టైల్ హాట్ చాక్లెట్‌ని తినకపోతే మెక్సికో వెళ్లడం వృధాగానే భావించాలి. ఎందుకంటే ఈ చాక్లెట్ ఇతర చాక్లెట్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీనిలో చిల్లీ పెప్పర్ కూడా కలుపుతారు.

ఇటలీలోని నగరాల్లో టురిన్ ఒకటి. దీనిని 'చాక్లెట్ క్యాపిటల్ ఆఫ్ ఇటలీ' అని పిలుస్తారు. ఇక్కడ సియోకోలాటో కాల్డో అనేది ఒక రకమైన హాట్ చాక్లెట్. ఇది మందంగా ఉంటుంది.
