ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు.. ఈనెలలో మూడోసారి కంపించిన భూమి

ఢిల్లీలో భూకంపం సంభవించింది. న్యూఢిల్లీకి పశ్చిమాన 8 8 కిలోమీటర్ల దూరంలో భూమి టు కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.5 మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టుగా నమోదైదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రాత్రి 9గంటల 30నిమిషాల..

ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు.. ఈనెలలో మూడోసారి కంపించిన భూమి
Earthquake
Follow us

|

Updated on: Nov 29, 2022 | 10:56 PM

ఢిల్లీలో భూకంపం సంభవించింది. న్యూఢిల్లీకి పశ్చిమాన 8 8 కిలోమీటర్ల దూరంలో భూమి టు కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.5 మ్యాగ్నిట్యూడ్ ఉన్నట్టుగా నమోదైదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రాత్రి 9గంటల 30నిమిషాల సమయంలో భూమి కంపిచినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.  ఈనెల రెండో వారంలో రెండు సార్లు భూకంపం సంభవించిది. నవంబర్‌లో వరుసగా మూడోసారి భూమి కంపించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. ఉత్తర భారత దేశాన్ని వరస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల కాలంలో హిమాలయ సీమలో వస్తున్న భూ ప్రకంపనలు కలవరపెడుతున్నాయి. నేపాల్, ఢిల్లీ, పంజాబ్ లో ఈనెలలో వచ్చిన భూకంప ఘటనలను మరవకముందే మరోసారి ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈనెల 14వ తేదీన అమృత్ సర్ లో తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో 3.42 గంటలకు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో భూమి నుంచి 120 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

నేపాల్ దేశంలో వచ్చిన భూకంపాలతో ఉత్తరాఖండ్, ఢిల్లీ ఇతర పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి పరుగులు తీసిన ఘటనలు మరువకముందే తాజాగా ఢిల్లీలో భూప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందారు. మరోవైపు నవంబర్ 12వ తేదీన రాత్రి 8 గంటలకు నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే.. హిమాలయాల్లో ఎప్పుడైనా భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి కేవలం ట్రయల్ మాత్రమేనని అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..