రెండో భార్య బంగారం అమ్మిన డబ్బు మొదటి భార్య, పిల్లలకు.. ! ఢిల్లీ హత్య కేసులో సంచలన నిజాలు..

అంజన్ దాస్ హత్య ఉదంతం గత జూన్‌లో ఢిల్లీలో లభ్యమైన శరీరభాగానికి సంబంధించిన దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది. మృతుడు మొదటి భార్యతో ఉన్న సంబంధాన్ని దాచిపెట్టడమే, కాకుండా..

రెండో భార్య బంగారం అమ్మిన డబ్బు మొదటి భార్య, పిల్లలకు.. ! ఢిల్లీ హత్య కేసులో సంచలన నిజాలు..
Delhi Pandav Nagar
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 29, 2022 | 1:08 PM

ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో భార్య, కొడుకు కలిసి భర్తను హత్య చేయడం వెనుక అసలు కారణాన్ని బయటపెట్టారు పోలీసులు. మృతుడు మొదటి భార్యతో ఉన్న సంబంధాన్ని దాచిపెట్టడమే అతడి హత్యకు అసలు కారణంగా తేల్చారు. అంజన్ దాస్‌ను హత్య చేసినందుకు అతని భార్య పూనమ్ దాస్, కుమారుడు దీపక్ దాస్‌లను సోమవారం అరెస్టు చేశారు. భర్తను హతమార్చిన తర్వాత దానిని మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి ఉంచారు. శరీర భాగాలను పలమార్లు బయటపడవేస్తూ వచ్చారు. అంజన్ దాస్ హత్య ఉదంతం గత జూన్‌లో ఢిల్లీలో లభ్యమైన శరీరభాగానికి సంబంధించిన దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది.

పాండవ్ నగర్‌లో నివసించే అంజన్‌దాస్‌ను అతని భార్య, కుమారుడు నిద్రమాత్రలు ఇచ్చి చంపేశారు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి పారేసే ప్రయత్నం చేశారు. శ్రద్ధా కేసు నేపధ్యంలో.. శరీర భాగాలు శ్రద్ధకు చెందినవేనా కాదా అని మళ్లీ విచారించగా.. అదే అంజన్ దాస్ హత్యకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ శరీర భాగాలను పడవేసిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యను పోలీసులు బహిర్గతం చేశారు. హత్యకు గురైన పూనమ్ దాస్ భర్త అంజన్ దాస్. అంజన్ దాస్ రెండో వివాహం పూనమ్‌తో జరిగింది. దీపక్ పూనమ్ మొదటి భర్త కల్లు కొడుకు. 2016లో మరణించిన తరువాత పూనత్ అంజన్ దాస్‌ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

తన మొదటి భార్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించడంతో ఇద్దరి పెళ్లి జరిగింది. అయితే పూనమ్ నగలు అమ్మగా వచ్చిన డబ్బును అంజన్ దాస్ బీహార్‌లో ఉంటున్న తన మొదటి భార్యకు పంపడంతో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. అతని మొదటి భార్య బీహార్‌లో నివసిస్తుంది. ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారు. తనకంటూ ఎవరూ లేరని చెప్పిన అంజన్ దాస్ కు ఉద్యోగం లేదు. పూనమ్, అతని కొడుకు పనిచేసి సంపాదించిన డబ్బుతో అంజన్ దాస్ ఎంజాయ్‌ చేస్తున్నాడని తెలిసింది. దీనికి తోడు పూనత్ పిల్లలపై అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు.

మే 30న అంజన్‌దాస్‌కు మద్యంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి హత్య చేశారు. తల నరికిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోని ఓ గదిలో భద్రపరిచారు. మరుసటి రోజు మృతదేహాన్ని పది ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచారు. చాలాసార్లు మృతదేహాన్ని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశారు. అందులో ఆరు భాగాలను పోలీసులు గుర్తించారు. మృతుడి శరీర భాగాలను తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్‌పురిలోని రాంలీలా గ్రౌండ్‌లో బ్యాగ్‌లో నింపినట్లు గుర్తించామని రవీందర్ యాదవ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి