AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pak Drone: మాదక ద్రవ్యాలతో దేశంలోకి ప్రవేశించిన పాక్ డ్రోన్.. కూల్చివేసిన భారత మహిళా బలగాలు..

ఇరు దేశాల మధ్య శాంతిస్థాపనకు భారత్ ఎంతగా ప్రయత్నిస్తున్నదో.. పాకిస్థాన్ అంతగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే  ఉంది. భారత సరిహద్దు ప్రాంతాలకు తన డ్రోనులను పంపుతూ సరిహద్దు బలగాలపై..

Pak Drone: మాదక ద్రవ్యాలతో దేశంలోకి ప్రవేశించిన పాక్ డ్రోన్.. కూల్చివేసిన భారత మహిళా బలగాలు..
Bsf Women Personnel
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 29, 2022 | 1:09 PM

Share

ఇరు దేశాల మధ్య శాంతిస్థాపనకు భారత్ ఎంతగా ప్రయత్నిస్తున్నదో.. పాకిస్థాన్ అంతగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే  ఉంది. భారత సరిహద్దు ప్రాంతాలకు తన డ్రోనులను పంపుతూ సరిహద్దు బలగాలపై దాడులు చేయడం.. లేదా మన దేశంలోని తన అనుచరులకు ఆయుధాలు, మాదక ద్రవ్యాల సరఫరాను కొనసాగిస్తూనే ఉంది  పాక్ . సోమవారం రాత్రి కూడా అదే తరహాలో మాదవ ద్రవ్యాలను మన దేశంలోకి తరలించేందుకు ప్రయత్నించింది పాక్. అయితే సరిహద్దు భద్రతా దళానికి చెందిన మహిళా బృంధం పాక్‌కు చెందిన డ్రోన్‌ను  కూల్చివేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో 3.1 కిలోల మాదక ద్రవ్యాలతో భారత్‌లోకి దూసుకెళ్తున్న పాక్ డ్రోన్‌ను కాల్చివేసి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

సోమవారం రాత్రి 11 గంటలకు అమృత్‌సర్ నగరానికి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చహర్‌పూర్ గ్రామ సమీపంలోని భారత భూభాగంలోకి ప్రవేశించడాన్ని బీస్ఎఫ్ మహిళా బృంధం గమనించారు. వెంటనే దానిపై కాల్పులు జరిపామని వారు తెలిపారు. బీఎస్ఎఫ్ మహిళా బలగాలు గస్తీ కాస్తున్న సమయంలో వారు  అమృత్‌సర్ ప్రాంతంలో ఈ డ్రోన్‌ను వారు గుర్తించారు. దానిలో సుమారు 3.11 కిలోల మాదక ద్రవ్యాలు ఉన్నాయని, ఆ డ్రోన్ 18 కిలోల బరువు ఉందని వారు తెలిపారు. డ్రోన్‌ కింది భాగంలో తెలటి పాలథిన్ కవర్‌లో మాదక ద్రవ్యాలను పెట్టారని వారు అన్నారు.

‘‘ అమృత్‌సర్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ ఎగరడాన్ని బీఎస్ఎఫ్ మహిళా బలగాలు గమనించాయి. వెంటనే అప్రమత్తమైన దళాలు డ్రోన్‌ను పట్టుకుని డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విఫలం చేయగలిగాయి. డ్రోన్‌ను మహిళా సిబ్బంది కూల్చివేశారు’’ అని ఫోర్స్ ప్రతినిధి తెలిపారు. కాగా, నవంబర్ 25న అమృత్‌సర్‌లోని దేశ సరిహద్దు సమీపంలో కూడా బీఎస్‌ఎఫ్ దళాలు పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం