Karnataka: ఓ విద్యార్థిని పాక్ ఉగ్రవాదితో పోల్చిన కర్ణాటక ప్రొఫెసర్.. సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించిన ఇనిస్టిట్యూట్..
ర్ణాటకలోని ఓ కళాశాల ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే ముస్లీం విద్యార్థిని ‘కసబ్’ అని సంబోధించాడు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తన టీచర్‌పై దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్
దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో జరిగిన 2008 26/11 ఉగ్ర దాడుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఉగ్రదాడులకు పాల్పడినవారిలో పాకిస్థాన్‌కు చెందిన కసబ్ కూడా ఒకడు. ఈ ఘటనకు పాల్పడినందుకు అతనికి భారత ప్రభుత్వం 2012లో ఉరిశిక్ష విధించింది. ఇప్పుడు కసబ్ గురించి ఎందుకు అనుకుంటున్నారా..? కర్ణాటకలోని ఓ కళాశాల ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే ముస్లీం విద్యార్థిని ‘కసబ్’ అని సంబోధించాడు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తన టీచర్‌పై దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో సదరు ఉపాధ్యాయుడిని ఆ కళాశాల సస్పెండ్ చేసింది. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడులకు ఈ నెల 26 నాటికి 14 ఏళ్లు. ఆ మరుసటి రోజే కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఉడిపిలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం ఓ ప్రొఫెసర్ తన విద్యార్థిని అతని పేరు అడిగాడు. ఆ విద్యార్థి చెప్పిన పేరు ముస్లీం వర్గానికి చెందినది కావడంతో వెంటనే ‘‘ఓహ్, నువ్వు కసబ్ లాగా ఉన్నావు..’’ అని అన్నాడు.
26/11 ముంబై దాడుల తర్వాత సజీవంగా పట్టుబడిన ఏకైక పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్. అతన్ని భారత్ 2012లో ఉరితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విద్యార్థి పాటింటే మతాన్ని కించపరచడమేనంటూ కొందరు ఆ ప్రోఫెసర్ మీద మండిపడుతున్నారు. సదరు ప్రొఫెసర్ అతన్ని ‘కసబ్’ అని పిలవగానే ఆ ముస్లీం విద్యార్థి.. “26/11 దాడులు తమాషా విషయం కాదు.. ఈ దేశంలో ముస్లిమ్‌గా ఉండి రోజూ వీటన్నింటిని ఎదుర్కోవడం కూడా తమాషా కాదు సార్. మీరు నా మతం గురించి, అది కూడా ఇంత కించపరిచే విధంగా జోక్ చేశారు. ఇది తమాషా కాదు సార్, కాదు’’ అని అరిచాడు. వెంటనే ఆ ప్రొఫెసర్ తన వ్యాఖ్యను వివాదం కాకుండా చేసేందుకు ప్రయత్నించాడు. ‘‘నువ్వు నా కొడుకులాంటివాడివే..’’ అంటూ విద్యార్థిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు ప్రొఫెసర్. దానికి ఆ విద్యార్థి ‘‘మీ కొడుకుతో అలా మాట్లాడతారా? టెర్రరిస్టు అనే పేరుతో పిలుస్తారా?’’ అని బదులిచ్చాడు.
ఘటనకు సంబంధించిన వీడియో..
A Professor in a class room in India calling a Muslim student ‘terrorist’ – This is what it has been to be a minority in India! pic.twitter.com/EjE7uFbsSi
— Ashok Swain (@ashoswai) November 27, 2022
ఆ క్రమంలో ప్రొఫెసర్ తన విద్యార్థికి క్షమాపణలు చెప్పాడు. ఇతర విద్యార్థులు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. వీడియో వైరల్ కావడంతో, ఇన్స్టిట్యూట్ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ‘‘ మేము ఇప్పటికే ఈ సంఘటనపై విచారణను ప్రారంభించాం. అంతవరకు సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశాం. ఈ విధమైన ప్రవర్తనను ఇన్‌స్టిట్యూట్ క్షమించదు. ఇలాంటి ఘటనకు పాల్పడితే ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నాము’’ అని ఇనిస్టిట్యూట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..