VNIT Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో విశ్వేశ్వరాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొలువులు.. పూర్తి వివరాలివే..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోనున్న విశ్వేశ్వరాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. 124 సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోనున్న విశ్వేశ్వరాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. 124 సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/ఐటీఐ/బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/డిప్లొమా/ఎంసీఏ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 27 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.400లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.