Maha-K’taka Land Dispute: వివాదం కేసు సుప్రీం కోర్టులో ఉందని.. అందులో ప్రధాని మోదీ జోక్యం అవసరం లేదన్న కేంద్ర మంత్రి..
మహారాష్ట్ర - కర్ణాటక సరిహద్దు వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర గనులు, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు . ధార్వాడ్ నగరంలో..
మహారాష్ట్ర – కర్ణాటక సరిహద్దు వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర గనులు, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు . ధార్వాడ్ నగరంలో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంలో ఎవరి జోక్యం అవసరం లేదన్నారు. ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నందున, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. కాబట్టి దీనిపై అనవసర గందరగోళం వద్దు, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని, మహారాష్ట్రలోని కర్ణాటక భూమిలో ఒక్క అంగుళం జోలికి వెళ్లదని తెలిపారు. మహారాష్ట్ర నుంచి తమకు ఒక్క అంగుళం భూమి కూడా దక్కలేదన్నారు.
సరిహద్దు వివాదం నేపథ్యంలో భాషా ప్రావిన్సుల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని, ఇప్పుడు ఎవరూ ప్రస్తావించడం సరికాదని జోషి సూచించారు. సుప్రీంకోర్టులో నైపుణ్యం కలిగిన న్యాయ నిపుణులు ఉన్నారి. సరిహద్దు సమస్యలపై సమర్ధవంతంగా వాదించగలనని జోషి అభిప్రాయపడ్డారు. “మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసింది, మనం కూడా అనవసరమైన ప్రకటనలు చేయకూడదని, పార్టీ నాయకులందరూ అదే చేయాలని మేము కోరుతున్నాము. మేము మా భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రెచ్చగొట్టే ప్రకటన ఏమీ చేయవద్దని.. అది సరికాదు. ఇప్పుడు కన్నడ-మరాఠీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. సరిహద్దు సమస్య తలెత్తినప్పటికీ మన రాష్ట్రంలో ఉన్న మరాఠీలు ఇప్పటికీ సంతోషంగానే ఉన్నారు’’ అని జోపి తెలిపారు.
కాగా, పాకిస్థాన్‌తో చైనాతో మనం ఘర్షణ పడాలి కానీ అది కర్ణాటక-మహారాష్ట్ర మధ్య జరగడం చాలా దురదృష్టకరమని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వివాదం సుప్రీంకోర్టులో ఉందని, మహారాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..