Indian Navy: విశాఖ సాగరతీరంలో అద్భుత విన్యాసాలు.. పెద్ద ఎత్తున తరలివచ్చిన నగర ప్రజలు..
నేవీ డే వేడుకలకు విశాఖపట్టణం సాగర తీరం రెడీ అవుతోంది. డిసెంబర్ 4వ తేదీన జరగనున్న ఈ వేడుకలను పురస్కరించుకొని తూర్పునావిదళం ఆధ్వర్యంలో నమూనా విన్యాసాలు నిర్వహించారు. యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది.. శత్రువులపై ఎలా ఎదురుదాడికి దిగుతుందో..
Navy Vinyasalu Vishakapatna
Follow us
నేవీ డే వేడుకలకు విశాఖపట్టణం సాగర తీరం రెడీ అవుతోంది. డిసెంబర్ 4వ తేదీన జరగనున్న ఈ వేడుకలను పురస్కరించుకొని తూర్పునావిదళం ఆధ్వర్యంలో నమూనా విన్యాసాలు నిర్వహించారు. యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తుంది.. శత్రువులపై ఎలా ఎదురుదాడికి దిగుతుందో విన్యాసాల రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
సోమవారం నమూనా విన్యాసాలు నిర్వహించారు. గగనంలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతూ బాంబులు వేయడం వంటి విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శనలు చూడటానికి పెద్దఎత్తున నగర ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం సమయంలో సముద్రంలో యుద్ధ నౌకలు విద్యుత్తు వెలుగులతో కనువిందు చేశాయి.
ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీడే జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో విశాఖ తూర్పు తీరంలో నేవీ డే వేడుకలకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారత నౌకాదళం యొక్క పాత్ర, విజయాలను గుర్తించడానికిభారత నౌకాదళ దినోత్సవం జరుపుకుంటారు. 1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌పై ఆపరేషన్ ట్రైడెంట్ ప్రారంభించిన జ్ఞాపకార్థం కూడా ఈ రోజు జరుపుకుంటారు.
నావి డే వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న రిహార్సల్స్ నగరవాసులను అబ్బురపరుస్తున్నాయి. భూమి, ఆకాశంతో పాటు సముద్ర జలాలపై చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్టణం నావికాదళ ఆయుధ సంపత్తిని, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అన్ని కూడా విపత్తుల సమయాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తాయో ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు.
భారత నావికా దళానికి వెన్నెముకగా తూర్పు నావికా దళం సేవలు అందిస్తోంది.1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్సీ ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971 మార్చి1న ఈఎన్సీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది.1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.