Mumbai Indians: ఈ టీమ్‌లోకి తిరిగి రానున్న ఇంగ్లాండ్ ప్లేయర్.. అతని బౌలింగ్‌లో జట్టు మరో సారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుస్తుందా..?
ప్రపంచ క్రీడలలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంత్యంత ఖరీదైన టోర్నమెంట్‌గా చెప్పుకునే ఐపీఎల్..
ప్రపంచ క్రీడలలో, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత ఖరీదైన టోర్నమెంట్‌గా చెప్పుకునే ఐపీఎల్.. 2023 మొదటిలోనే ప్రారంభమయ్యేందుకు సర్వత్రా సిద్ధంగా ఉంది. ఐపిఎల్‌లో మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొనున్నాయి. ఐపీఎల్ లీగ్‌ను ఇప్పటికే ఐదు సార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ కూడా వాటిలో ఒకటి. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టు మొత్తం 13 మంది ఆటగాళ్లను నవంబర్ 15న రిటెన్షన్ గడువులో విడుదల చేసింది. వీరిలో కొంతమంది ఫాస్ట్ బౌలర్లు కూడా ఉండగా.. ఈ ఇంగ్లండ్ స్టార్ వారిలో ఒకరు కాదు. ఇంగ్లండ్ స్టార్, ముంబై ఇండియన్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ఐపిఎల్ 2023 కోసం ఈ ఫ్రాంచైజీ తనతోనే ఉంచుకుంది. గాయం కారణంగా ఐపిఎల్ 2022 సీజన్‌కు పూర్తి దూరం పాటించిన ఆర్చర్ 2023 సీజన్‌కు తిరిగి వస్తాడని అందరూ భావిస్తున్నారు.
ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రతినిధి క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..‘‘జోఫ్రా ఆర్చర్ ప్రస్తుతం ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో యూఏఈలో ఉన్నాడు. ఇంకా అతను తన గాయం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తొందరగా కోలుకొని, 2023 నుంచి మళ్లీ పోటీగా ఆడాలని చూస్తున్నాడని నా అభిప్రాయం. ప్రస్తుతం అతను తన కోచ్ జోన్ లూయిస్ పర్యవేక్షణలో, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌తో కూడా కలిసి ప్రాక్టీసు చేస్తున్నాడు’’ అని అన్నాడు. కాగా, మోచేయి గాయం కారణంగా చాలా కాలం నుంచి ఆటకు దూరంగా ఉంటున్న ఆర్చర్.. మార్చి 2021 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
Heartfelt gratitude to the batch of 2️⃣0️⃣2️⃣2️⃣ ?
Read more about the memories that we will cherish forever ?#OneFamily https://t.co/cVEo7ctakZ
— Mumbai Indians (@mipaltan) November 16, 2022
ముంబై ఇండియన్స్ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా:
కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్
ముంబై ఇండియన్స్‌లో మిగిలిన ఆటగాళ్ల జాబితా:
రోహిత్ శర్మ (సి), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..