- Telugu News Photo Gallery Cricket photos Bcci to consider split captaincy new selection committee to choose captains across three formats
BCCI : బీసీసీఐ కీలక నిర్ణయం.. మూడు ఫార్మాట్లలో కొత్త కెప్టెన్లను ఎంపిక చేయనున్న కొత్త సెలక్షన్ కమిటీ..
చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీని BCCI తొలగించింది. దీని తర్వాత టీ20, వన్డే, టెస్టు వంటి మూడు రకాల క్రికెట్‌కు ముగ్గురు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Updated on: Nov 19, 2022 | 5:42 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంది. టీమిండియా టీ20 ప్రపంచకప్ లో సెమీస్‌కు చేరుకోవడం వరకే పరిమితమైంది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది.

చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీని బీసీసీఐ ఇప్పటికే తొలగించింది. జట్టు ఓడిపోయిన ప్రతిసారీ ఎంపిక ప్రక్రియపై విమర్శలు వస్తున్నాయి. దీంతో చేతన్ సహా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని తొలగించారు.

ఈ నేపథ్యంలో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీ20, వన్డే, టెస్టు అనే మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు ముగ్గురు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.

బీసీసీఐ త్వరలో కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి కొత్త నాయకత్వ బాధ్యతలను ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చిస్తుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

శుక్రవారం బీసీసీఐ సీనియర్ పురుషుల జట్టు సెలక్షన్ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28 చివరి తేదీ. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త కెప్టెన్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న టీ20 క్రికెట్ పర్యటనకు హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తదుపరి టీ20 జట్టుకు పాండ్యా కెప్టెన్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించి ఛాంపియన్‌షిప్ గెలిచిన అనుభవం హార్దిక్‌కు ఉంది.

పాండ్యాతో పాటు కేఎల్ రాహుల్ పేరు కూడా వినిపిస్తోంది. రాహుల్ ప్రస్తుతం భారత వైట్-బాల్ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్. ఈ బాధ్యత ఏడాదిన్నరగా ఉంది. కాబట్టి రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా రాహుల్ పోటీలో ఉన్నాడు.

టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా హార్దిక్‌ను భారత టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేయాలని సలహా ఇచ్చాడు. భారత తదుపరి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంలో తప్పేమీ లేదని శాస్త్రి పేర్కొన్నాడు.




