బద్ధలైన ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిప‌ర్వతం.. భారీగా ఎగిసిపడుతున్న లావా! వైర‌ల్ అవుతున్న ఫొటోలు

లావా ప్రవాహం స్థానం, వేగం రెండూ చాలా వేగంగా మారగలవని USGS తెలిపింది. విస్ఫోటనం స్వల్పంగా ఉంటే, లావా కూడా పైన ఉంటుంది. అయితే ఈ పేలుడు మరింత పెరిగితే మాత్రం కష్టమే. విస్ఫోటనం పెరిగితే,

బద్ధలైన ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిప‌ర్వతం.. భారీగా ఎగిసిపడుతున్న లావా! వైర‌ల్ అవుతున్న ఫొటోలు
World’s Largest Active Volcano
Follow us

|

Updated on: Nov 29, 2022 | 12:07 PM

ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం మౌనా లోవా హవాయిలో బద్దలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం మౌనా లువా 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా బద్దలైంది. నవంబర్ 27న స్థానిక కాలమానం ప్రకారం సుమారు 11:30 గంటలకు అగ్నిపర్వతం బద్దలైంది. ఆదివారం రాత్రి నుంచి ఎరుపు రంగులో లావా బ‌య‌ట‌కు ఎగసిప‌డుతోంది. ప్ర‌స్తుతం అగ్నిప‌ర్వతం ఉన్న భాగం వ‌ర‌కే లావా పొంగుకొని వ‌స్తోంది. ఇప్ప‌టివ‌ర‌కైతే దిగువ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు దీనివల్ల‌ ఏలాంటి ప్ర‌మాదం లేదని అమెరికా జియోలాజిక‌ల్ వోల్క‌నిక్ యాక్టివిటీ స‌ర్వీసెస్ (యూఎస్‌జీఎస్‌) వెల్ల‌డించింది. అయితే.. లావా ప్ర‌వాహం క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్న‌ట్టు అధికారులు గుర్తించారు. దాంతో, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

అంతేకాదు సాధ్య‌మైనంత తొంద‌ర‌గా హ‌వాయి వొల్క‌నో అబ్జ‌ర్వేట‌రీ (హెచ్‌వీఓ) సంస్థ ఆ ప్రాంతంలో ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అగ్నిప‌ర్వతం నుంచి వెలువ‌డుతున్న లావా తీవ్ర‌త‌, దాని ప‌రిణామాల గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు ఈ స‌ర్వే చేయనుంది. మౌనా లోవా అనేది ప్ర‌పంచ‌వ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న అగ్నిప‌ర్వ‌తాల్లోకెల్లా పెద్ద‌ది. ఈ అగ్నిప‌ర్వ‌తం ఫ‌సిఫిక్ మ‌హాస‌ముద్ర మ‌ట్టానికి 13,796 అడుగుల ఎత్తులో ఉంది.

ఇవి కూడా చదవండి

మౌనా లోవా అగ్నిపర్వతం అమెరికాలోని హవాయిలో ఉంది. హవాయి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భూభాగం. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం బలమైన గాలులు అగ్నిపర్వత బూడిద, వాయువును ఇతర ప్రాంతాలకు కూడా తీసుకువెళతాయి. లావా ప్రవాహం స్థానం, వేగం రెండూ చాలా వేగంగా మారగలవని USGS తెలిపింది. విస్ఫోటనం స్వల్పంగా ఉంటే, లావా కూడా పైన ఉంటుంది. అయితే ఈ పేలుడు మరింత పెరిగితే మాత్రం కష్టమే. విస్ఫోటనం పెరిగితే, లావా బయటకు రావడం ప్రారంభమవుతుంది. చాలా వేగంతో క్రిందికి కదులుతుంది.

అమెరికాలో ఎర్రటి ఆకాశం ఈ అగ్నిపర్వతం మౌనా లోవా పేలడం వల్ల ప్రస్తుతం జనావాసాలకు ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. మౌనా లోవా అగ్నిపర్వతం పేలిన తర్వాత హవాయి ప్రజలు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్‌ చేస్తున్నారు.. ఇందులో ఆకాశం ఎర్రగా మారడం కనిపిస్తుంది. అదే సమయంలో, కొన్ని చిత్రాలలో బూడిద నేలపై కనిపిస్తుంది. ప్రవహించే లావా నిప్పుల నదిలా కనిపిస్తోందని చాలా మంది సోషల్ మీడియాలో రాశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి