కూతురిపై కన్న తండ్రి దారుణం… 107 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు..

ఇదే సాకుగా తీసుకుని ఆ నిస్సహాయ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మతి స్థిమితం సరిగా లేని కూతురిపై కిరాతకం ప్రదర్శించాడు ఆ కామాంధుడైన తండ్రి.

కూతురిపై కన్న తండ్రి దారుణం... 107 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు..
Rape Incident
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 29, 2022 | 9:22 AM

మానసిక వికలాంగురాలైన కూతురిపై ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో కేరళలోని పోక్సో కోర్టు 107 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 4 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని సూచించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించగా..

కేరళలోని పతనంటిట్టా జిల్లాలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల మానసిక వికలాంగ బాలిక, ఆమె తండ్రితో కలిసి నివస్తుంది. తల్లి లేదు. భార్యకు దూరమైన అతడు..ఇదే సాకుగా తీసుకుని ఆ నిస్సహాయ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మతి స్థిమితం సరిగా లేని కూతురిపై కిరాతకం ప్రదర్శించాడు ఆ కామాంధుడైన తండ్రి. తండ్రి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఆ కూతురు తప్పించుకుని పక్క ఇంటికి వెళ్లింది. ఆ నిస్సహాయంగా రోధిస్తున్న ఆ బాలికను స్థానికులు చేరదీశారు. బాలిక పరిస్థితిపై ఆరా తీశారు.

దాంతో బాధితురాలు తన తండ్రి చేసిన దారుణాల గురించి చెప్పింది. అనంతరం స్థానికులు, స్కూల్‌ టీచర్‌ సాయంతో చైల్డ్‌లైన్‌ కార్యకర్తలకు సమాచారం అందించారు. నిందితుడిపై 2020లో కేసు నమోదైంది. తన కుమార్తెను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన తండ్రిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ప్రాసిక్యూషన్ అభియోగాన్ని కోర్టు సమర్థిస్తూ పోక్సో చట్టం కింద అతడిని దోషిగా నిర్ధారించింది. 107 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 4 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి