వెరైటీ ల‌వ్ ప్ర‌పోజ‌ల్.. ప్రేయసి కోసం స‌ముద్రంలో దూకిన ప్రియుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయితో బోట్‌లో వెళ్తూ.. టైటానిక్ సినిమా పోజ్‌లో ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు. కానీ, అతడి ప్రయత్నం బెడిసికొట్టింది.

వెరైటీ ల‌వ్ ప్ర‌పోజ‌ల్.. ప్రేయసి కోసం స‌ముద్రంలో దూకిన ప్రియుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Love Propose
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 29, 2022 | 8:23 AM

తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె ముందు ఒక ప్రపోజల్ పెట్టడం, ఆమె దానిని అంగీకరించడం వారిద్దరి జీవితంలోని అత్యంత అందమైన క్షణం. ఈ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి వీడియో వైరల్‌గా మారింది. కానీ ఈ వీడియోలోని సంఘటన చాలా అరుదు. ఎందుకంటే.. ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయితో బోట్‌లో వెళ్తూ.. టైటానిక్ సినిమా పోజ్‌లో ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు. కానీ, అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ఉంగరం అతని చేతిలోంచి జారి సముద్రంలో పడింది. వెంటనే అబ్బాయి నీళ్లలోకి దూకి నీళ్లలో నిలబడి ఉంగరం చూపించి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఈ వీడియోను స్కాట్ క్లైన్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఇంతకీ అక్కడ అసలు ఏం జరిగిందంటే..ఇద్దరు ప్రేమికులు ప్రశాంతంగా బోటు ప్రయాణం చేస్తున్నారు. చుట్టూ నీళ్లు, ఆహ్లదకరమైన వాతావరణంలో టైటానిక్‌ రేంజ్‌లో ఆ ప్రియుడు స్కాట్ క్లెయిన్ త‌న ప్రియురాలి వేలికి ఉంగరం తొడిగేందుకు త‌న జేబులో నుంచి ఆ ఉంగ‌రాన్ని బ‌య‌ట‌కు తీశాడు. కానీ ఆ రింగ్ నీటిలో ప‌డిపోయింది. దాంతో అతడు క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా క్లెయిన్ నీటిలో దూకేశాడు. ప్రేయ‌సితో పాటు అక్క‌డున్న మ‌రో ఇద్ద‌రు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఉంగ‌రం బాక్స్ నీటిపై తేలియాడంతో క్ష‌ణాల్లోనే దాన్ని ప‌ట్టుకున్నాడు క్లెయిన్‌. ఇక ఆ ఉంగ‌రాన్ని బోటులో ఉన్న వ్య‌క్తికి అందించాడు. అనంత‌రం అత‌ను బోటులోకి వ‌చ్చేశాడు. ఆ త‌ర్వాత ప్రియురాలు సుజీ ట‌క్క‌ర్ వేలికి ఆ రింగ్‌ను తొడిగి ల‌వ్ ప్రపోజ్ చేశాడు. ఆమె అత‌ని ప్రేమ‌ను అంగీక‌రించింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబైంది. అతన్ని ముద్దుల‌తో ముంచెత్తింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను స్కాట్ క్లెయిన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. ఇది 100 శాతం నిజం, 100 శాతం నా అదృష్టం. 100 శాతం ఎప్ప‌టికీ మ‌రిచిపోను అని రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వారి ప్రేమ‌ను అభినందిస్తూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి