పెట్రోల్‌ బంకులో యువకుడి తొందరపాటు.. పాపం తండ్రి బలి.. వైరలవుతున్న వీడియో

ఓ వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు పెట్రోల్‌ బంకుకు వచ్చాడు. అతనితో పాటు బైక్‌పై వెనుక సీట్లో అతని తండ్రి కూడా కూర్చున్నాడు. ఈ క్రమంలోనే పెట్రోల్ బంకు వద్ద కొద్దిపాటి రద్దీ ఉండడంతో..

పెట్రోల్‌ బంకులో యువకుడి తొందరపాటు.. పాపం తండ్రి బలి.. వైరలవుతున్న వీడియో
Petrol
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 28, 2022 | 1:02 PM

పెట్రోల్ బంకుల్లో వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ నింపేందుకు వెళ్లినప్పుడు క్యూలో నిలబడతాం. అయితే కొంతమంది మాత్రం ఎంత రద్దీగా ఉన్నా హడావుడి చేస్తుంటారు. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని వ్యక్తి కూడా సరిగ్గా ఇలానే చేశాడు. అతడు చేసిన పనికి పాపం అతని తండ్రి తిప్పలు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయగా, సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చాలా మంది నెటిజన్లు రీట్వీట్ కూడా చేశారు. సువిదా అనే వినియోగదారు ఈ వీడియోను ఫన్నీ క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే విపరీతమై వ్యూస్‌ని సాధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు పెట్రోల్‌ బంకుకు వచ్చాడు. అతనితో పాటు బైక్‌పై వెనుక సీట్లో అతని తండ్రి కూడా కూర్చున్నాడు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకు వద్ద కొద్దిపాటి రద్దీ ఉండడంతో అందరూ క్యూలో వస్తారు. కానీ అతను ఒక్కడు మాత్రం తన బైక్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు.. ఈ క్రమంలోనే బైక్‌ స్పీడ్‌ అదుపుతప్పి ముందు చక్రం ఒక్కసారిగా పైకి లేస్తుంది. దాంతో దీంతో వెనుక కూర్చున్న వ్యక్తి తండ్రి కిందపడిపోయాడు. అంతేకాదు పక్కనే పార్క్ చేసిన మరో బైక్‌ను ఢీ కొట్టడంతో అతడు కూడా కిందపడిపోతాడు.

ఇవి కూడా చదవండి

బైక్‌ పైకి లేవటంతో ఆ యువకుడి తండ్రి ఒక్కసారిగా కిందపడిపోవడంతో అతడి వెన్నులో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. కొడుకు చేసిన తప్పుకు తండ్రిని శిక్షించినట్లే అయింది. ఈ వీడియో చూసిన పలువురు తండ్రి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆ వ్యక్తి తొందరపాటు ప్రవర్తనకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి