శీతాకాలంలో సైనస్ తీవ్రత నుండి బయటపడేందుకు ఇలాంటి చిట్కాలు పాటించండి..

భయంకరమైన తలనొప్పి వేధిస్తుంది. మామూలు తలనొప్పి కంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. తీవ్రమైన చలిలో సైనస్‌ నొప్పి మరింత వేధిస్తుంది. ముఖంలో

శీతాకాలంలో సైనస్ తీవ్రత నుండి బయటపడేందుకు ఇలాంటి చిట్కాలు పాటించండి..
Sinus Health Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 29, 2022 | 6:46 AM

చలికాలంలో చాలామందికి వచ్చే సమస్య సైనసైటిస్. సైనస్‌లు పుర్రెలో, ముక్కుకు ఇరువైపులా కళ్ల చుట్టూ గాలి కావిటీస్. సైనస్ వాపు, ఇన్ఫెక్షన్, బ్లాక్ అయినప్పుడు సైనసైటిస్ అంటారు. సైనసైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. సైనసిటిస్ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ప్రధాన కారణాలు తీవ్రమైన జలుబు, నిరంతర అలెర్జీలు, సైనస్ అడ్డంకులు, నాసికా రంద్రాల్లో అడ్డంకులు, ధూమపానం, వాయు కాలుష్యం కారణంగా సైనస్‌ వేధిస్తుంది. చలికాలంలో చాలా మందికి జలుబు వస్తుంది. ఇది తీవ్రం కావటంతో సైనసైటిస్ వస్తుంది.

సైనస్ లకణాలు..భయంకరమైన తలనొప్పి వేధిస్తుంది. మామూలు తలనొప్పి కంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. తీవ్రమైన చలిలో సైనస్‌లో నొప్పి మరింత వేధిస్తుంది. సైనసిటిస్ అనేది మీ బుగ్గలు, నుదిటి వెనుక, ముక్కుకు ఇరువైపులా వచ్చే వాపు. ఇది గొంతు నుంచి పొట్ట వరకు శ్లేష్మ ప్రవాహాన్ని ఆపుతుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా ఇది వ్యాపించవచ్చు. దీర్ఘకాలిక అలర్జీలు, నాసల్ పోలిప్స్ వల్ల ఈ సమస్య రావచ్చు.అప్పుడప్పుడు కఫంతో రక్తస్రావం కావడం కూడా లక్షణాలు.

జలుబు తీవ్రతకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి. దాని కోసం వెచ్చని బట్టలు ధరించండి. మీకు జలుబు ఉంటే దానిని వదిలించుకోవడానికి చర్యలు తీసుకోండి. దాని కోసం తరచూ ఆవిరి పట్టుకోవటం చేస్తుండాలి. ఆవిరి పట్టడం ద్వారా నాసికా భాగాలు తెరచుకుంటాయి. నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. పసుపు, తులసి, యూకలిప్టస్, వంటి మూలికలను నీటిలో మరిగించి ఆవిరిపట్టవచ్చు. అదేవిధంగా ఎర్ర ఉల్లిపాయల చూర్ణం, తులసి ఆకుల రసంతో తయారు చేసిన ఆహారాలను రోజుకు మూడుసార్లు తీసుకోవటం చేయాలి.

ఇవి కూడా చదవండి

సైనస్ లక్షణాలు ఉన్నవారు ముక్కు, బుగ్గలు, కళ్లపై ఆవిరి పట్టిన టవల్ లేదా క్లాత్‌తో మర్దన చేయాలి. దీనివల్ల నాసిక రంధ్రాలు తెరచుకొని శ్లేష్మం వదులుతుంది.

దుమ్ము, దూళికి దూరంగా ఉండాలి. అలాగే పొగ, ధూమపానానికి దూరంగా ఉండాలి. అలెర్జీ కారకాలను ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి. నీరు పుష్కలంగా త్రాగాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ కూడా సైనస్ తీవ్రతను పెంచుతుంది.సైనస్ బాధితులు తరచుగా నీరు తాగడం వల్ల శ్లేష్మం తొలగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  పోషకాహారం కూడా ముఖ్యం. యోగా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులు, ఎండుమిర్చితో కషాయం తయారు చేసి గోరువెచ్చగా తాగడం వల్ల జలుబు, ముక్కు దిబ్బడ నుండి బయటపడవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి