Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఏ కాలంలో అయినా చలి నీళ్ల స్నానం మేలంట.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

వేడి నీళ్లతో స్నానం మంచిదా.. చలి నీళ్ల స్నానం మంచిదా అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. కొంతమందికి సరైన సమాధానం దొరికితే.. మరికొంతమందికి సమాధానం దొరకదు. కాలంతో సంబంధం లేకుండా చాలా మంది వేడి నీళ్ల స్నానానికి ..

Health Tips: ఏ కాలంలో అయినా చలి నీళ్ల స్నానం మేలంట.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Bath
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 29, 2022 | 9:16 AM

వేడి నీళ్లతో స్నానం మంచిదా.. చలి నీళ్ల స్నానం మంచిదా అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. కొంతమందికి సరైన సమాధానం దొరికితే.. మరికొంతమందికి సమాధానం దొరకదు. కాలంతో సంబంధం లేకుండా చాలా మంది వేడి నీళ్ల స్నానానికి  అలవాటు పడిపోతారు. అంతేకాదు వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయరు కొంతమంది. మరికొంతమంది అయితే చలికాలంలో వేడి నీళ్ల స్నానానికి అలవాటు పడతారు. శీతాకాలంలో చలి నీళ్లతో స్నానం చేస్తే మరింత చల్లగా ఉంటుంది కాబట్టి.. ఉదయం లేచిన తర్వాత.. కాల కృత్యాలు తీర్చుకుని వేడి నీళ్లతో స్నానం చేస్తారు.  చాలామంది చల్లటి నీటితో స్నానం అంటే వణికిపోతారు. కానీ కొంతమంది సులువుగా చేస్తారు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా ఇట్టే చేసేస్తారు. అయితే చల్లటి నీటితో స్నానం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆరోగ్య కారణాల దృష్ట్యా చల్లటి నీటితో స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చలి నీళ్లతో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

చల్లటి నీటితో స్నానం చేసినప్పుడల్లా రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చల్లటి నీరు మన హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది. ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది.

చర్మ సౌందర్యం

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. కానీ చల్లని నీటితో స్నానం మీ చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. ఇది మంటను తగ్గిస్తుంది, మొటిమల సమస్యను కూడా తొలగిస్తుంది. అలాగే జుట్టు కూడా దెబ్బతినకుండా, చిట్లకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టాక్సిన్లు దూరం 

తెల్లవారుజామున నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, మురికిని వదిలించుకోవచ్చు. అంతేకాదు వివిధ వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లని కూడా చంపుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

చల్లని జల్లులు ఒత్తిడిని దూరం చేస్తాయి. మానసిక స్థితిని త్వరగా శాంతపరుస్తుంది. నిరాశను తగ్గిస్తుంది. సోమరితనం, అలసటను వదిలిస్తుంది. కాబట్టి చన్నీటి స్నానం చాలా మంచిది.

 నిద్ర

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇది మీ నిద్ర రుగ్మతలను నయం చేస్తుంది. త్వరగా రిలాక్స్‌ అయి ప్రశాంతంగా ఉంటారు. అందుకే పడుకునే ముందు స్నానం చేయాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..