Viral: కడుపునొప్పితో అస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..

అప్పుడప్పుడూ డాక్టర్లను షాక్‌కు గురి చేసే కేసులు వస్తాయన్నది వాస్తవం. మనం కూడా ఆ వార్తలు విని ఉంటాం. ఇక ఇప్పుడు సరిగ్గా అలాంటి కేసు ఒకటి మీకు చెప్పబోతున్నాం.

Viral: కడుపునొప్పితో అస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..
Rare Incident
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 29, 2022 | 8:10 AM

అప్పుడప్పుడూ డాక్టర్లను షాక్‌కు గురి చేసే కేసులు వస్తాయన్నది వాస్తవం. మనం కూడా ఆ వార్తలు విని ఉంటాం. ఇక ఇప్పుడు సరిగ్గా అలాంటి కేసు ఒకటి మీకు చెప్పబోతున్నాం. సాధారణంగా చిన్న పిల్లలు పొరపాటున రూపాయి నాణేలు మింగేస్తుంటారని మనకి తెలిసిందే. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా 187 నాణేలు మింగేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాకు చెందిన 58 ఏళ్ల ద్యామప్ప హరిజన్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదు. గత కొన్నేళ్లుగా అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే తాగుడుకు బానిసైన ద్యామప్ప హరిజన్.. తనకు తెలియకుండానే ఒకటి, రెండు, ఐదు రూపాయల నాణేలను మింగేస్తుండేవాడు. అయితే ఒక రోజు అతడికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ద్యామప్పకు ఎండోస్కోపీ చేయగా.. అతడి పొట్టలో నాణేలను గుర్తించి దెబ్బకు షాకయ్యారు. దీంతో గంటన్నర పాటు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు.. ద్యామప్ప పొట్టలో నుంచి సుమారు 187 నాణేలను తొలగించారు. వాటిల్లో 56 రూ. 5 నాణేలు, 51 రూ. 2 నాణేలు, 80 రూ. 1 నాణేలు ఉన్నాయి. కాగా, ఈ నాణేలు పేగుల్లోకి కాకుండా పొట్టలోకి వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్రస్తుతం పేషెంట్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచామని డాక్టర్లు చెప్పారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..

Karnataka