Zombie Virus: వేల సంవత్సరాల నాటి మంచు కరగడంతో వెలుగులోకి వచ్చిన బాంబీ వైరస్.. గ్లోబల్ వార్మింగే దీనికి కారణమంటున్న శాస్త్రవేత్తలు..
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచ ధ్రువాలలోని మంచు కలిగిపోతుంది. తద్వారా వేల సంవత్సరాల నుంచి మంచులో చిక్కుకుని ఉన్న అనేక రకాల సూక్ష్మజీవులను విడుదల అవుతున్నాయి. అలా మంచు నుంచి..
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచ ధ్రువాలలోని మంచు కలిగిపోతుంది. తద్వారా వేల సంవత్సరాల నుంచి మంచులో చిక్కుకుని ఉన్న అనేక రకాల సూక్ష్మజీవులను విడుదల అవుతున్నాయి. అలా మంచు నుంచి బయటకు వస్తున్న సూక్ష్మజీవులను అధ్యయనం చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకోసం వారు సైబీరియాలో ఎంతో కాలంగా ఉన్న మంచు నుండి జాంబీ వైరస్‌ను బయటకు తీసుకువచ్చారు. వీటిలో ఒక రకం వైరస్ దాదాపు 50,000 సంవత్సరాల నాటిదని వారి అంచనా. ఈ వైరస్‌కు వారు ‘పండోరవైరస్ యెడోమా ’అని పేరు పెట్టారు .సైన్స్ అలర్ట్‌లో ప్రచురించబడిన ఒక వార్తాకథనంలో ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ చీఫ్ సైంటిస్ట్ జీన్-మేరీ అలెంపిక్ ఈ వైరస్ గురించి మాట్లాడారు. ‘‘ మంచు నంచి బయటకు వచ్చిన ఈ వైరస్‌లు ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతాయి. అంటువ్యాధులకు కారణమయ్యే ఈ వైరస్ గురించి, వాతావరణంలోకి అవి విడుదలయితే కలిగే ప్రమాదాలను అంచనా వేయడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉంది’’ అని ఆయన అన్నారు.
“ఉత్తర అర్ధగోళంలోని నాలుగింట ఒక వంతు భాగం శాశ్వతంగా ఘనీభవించిన నేలతో కప్పబడి ఉంది. దీనిని శాశ్వత మంచుగా సూచిస్తారు. వాతావరణ వేడెక్కడం కారణంగా, మిలియన్ల సంవత్సరాలుగా ఘనరూపంలో నిలిచి ఉన్న మంచు దాని నుంచి సేంద్రీయ పదార్థాలు విడుదల అవుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం కార్బన్ డయాక్సైడ్, మీథేన్‌లే. ఇవి గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి’’ అని మేరీ అలెంపిక్ తెలిపారు.
కాగా, దాదాపు 50,000 సంవత్సరాల పురాతన అమీబా వైరస్‌ను శాస్త్రవేత్తలు ఒక సరస్సు క్రింద మంచులో కనుగొన్నారు. అయితే వారు చేసిన ప్రకటనలో అవి తొమ్మిది వేలు లేదా పదివేల సంవత్సరాల నాటివని అంచనా వేశారు. ఇతర వైరస్‌లు మముత్ ఉన్నిలో, సైబీరియన్ తోడేలు ప్రేగులలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..