శబరిమల అయ్యప్పకు కళ్లుచెదిరే ఆదాయం.. పది రోజుల్లోనే ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
గతేడాది ఇదే సమయానికి భక్తుల నుంచి ఆలయ అధికారులకు రూ.9.92 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది.. ఎందుకంటే ఆ సమయంలో కోవిడ్ ఆంక్షల కారణంగా అభిమానులపై అనేక ఆంక్షలు విధించారు. కానీ, ఈ యేడు మాత్రం..
శబరిమల ఆలయంలో పుణ్యకాలం కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారు. ఈ ఏడాది మండల-మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరచుకున్నప్పటి నుంచి అయ్యప్ప భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. మండల కాలం దీక్ష పూర్తిచేసుకుని, ఇరుముడితో శబరిమల చేరుకుని స్వామివారికి సమర్పించుకుంటున్నారు. ఈ ఏడాది స్వామికి ఆదాయం భారీగా సమకూరుతోంది. ఈ సీజన్‌లో 10 రోజుల్లో ఆలయానికి 52 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. శబరిమలలో రికార్డు ఆదాయం రూ. 52 కోట్లు సమకూరినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు న్యాయవాది కె.అనంతగోపాలన్‌కు తెలిపారు
‘అప్పం’ విక్రయం ద్వారా ఆలయ అధికారులకు రూ.2.58 కోట్లు, అరవణ విక్రయం ద్వారా రూ.23.57 కోట్లు వచ్చినట్లు తెలిపారు. శబరిమల ఆలయానికి హుండీ ఆదాయం రూ.12.73 కోట్లు. గతేడాది ఇదే సమయానికి భక్తుల నుంచి ఆలయ అధికారులకు రూ.9.92 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది.. ఎందుకంటే ఆ సమయంలో కోవిడ్ ఆంక్షల కారణంగా అభిమానులపై అనేక ఆంక్షలు విధించారు.
దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ అనంత్ గోపన్ మాట్లాడుతూ.. ఆదాయంలో ఎక్కువ భాగం ఉత్సవాల నిర్వహణకే వినియోగించామన్నారు. ఆలయానికి వెళ్లే నాలుగు దారులు తెరిచామని, భక్తులు తమ ఇష్టానుసారం ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని ఆలయానికి చేరుకోవచ్చని తెలిపారు. శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు తమ ఆలయ సందర్శనను ఆన్‌లైన్ పోర్టల్ లేదా స్పాట్ బుకింగ్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి