ప్రియురాలితో కలిసి జల్సా చేసేందుకు ఏటీఎంనే లూటీ చేసిన సెక్యూరిటీ గార్డ్‌.. రూ14.20 లక్షలు రికవరీ.. ఇంకా..

ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని విలాసవంతమైన జీవితం గడిపేందుకు దొంగతనానికి పాల్పడ్డాడని తేలింది. దోచుకున్న డబ్బుతో హోటల్ తెరవాలని ప్లాన్ చేశాడు.

ప్రియురాలితో కలిసి జల్సా చేసేందుకు ఏటీఎంనే లూటీ చేసిన సెక్యూరిటీ గార్డ్‌.. రూ14.20 లక్షలు రికవరీ.. ఇంకా..
Sbi Atm New Rule
Follow us

|

Updated on: Nov 29, 2022 | 10:37 AM

తాను ప్రేమిస్తున్న యువతిని పెళ్లి చేసుకునేందుకు దొంగగా మారాడు ఓ యువకుడు. అందుకోసం ఏకంగా తాను పనిచేస్తున్న ఏటీఎంలో చోరీ చేసి పారిపోయిన సెక్యూరిటీ గార్డును విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అస్సాంకు చెందిన దీపోంకర్ నోమోసుందర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. విల్సన్ గార్డెన్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఏటీఎం నింపేందుకు వచ్చిన కస్టోడియన్ సిబ్బంది నమ్మకాన్ని పొందగలిగాడు. వారు డబ్బులు జమ చేసేందుకు వచ్చే వారు వాడే ఐడీ, పాస్ వర్డ్‌ అతనికి తెలుసు. అదే ఐడీ-పాస్‌వర్డ్‌తో 19.96 లక్షలు దొంగిలించి పరారయ్యాడు. అస్సాంలోని చాపర్‌ముఖ్ జిల్లాకు వెళ్లి తలదాచుకున్నాడు.

విచారణలో నిందితుడు అస్సాంలోని ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని విలాసవంతమైన జీవితం గడిపేందుకు దొంగతనానికి పాల్పడ్డాడని తేలింది. దోచుకున్న డబ్బుతో హోటల్ తెరవాలని ప్లాన్ చేశాడు. నిందితుడు బాగా పనిచేసి ఆపై ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు.

ఇవి కూడా చదవండి
Atm Theft

సీసీటీవీలో రికార్డైన నిందితుల చోరీ దృశ్యాల ఆధారంగా విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అస్సాం వెళ్లి నిందితులను పట్టుకోవడంలో విజయం సాధించారు. ప్రస్తుతం అరెస్టయిన వారి నుంచి రూ.14.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి