చలికి వణుకుతున్న ఉత్తర భారతం.. చాలా ప్రాంతాల్లో సాధారణంకంటే కనిష్ట ఉష్ణోగ్రతలు..

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Nov 30, 2022 | 5:21 AM

ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోడుతున్నాయి. రాజస్థానాలోని చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల సెల్సియస్‌లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. పర్యాటక ప్రాంతం మౌంట్ అబూలో ప్రస్తుత సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత..

చలికి వణుకుతున్న ఉత్తర భారతం.. చాలా ప్రాంతాల్లో సాధారణంకంటే కనిష్ట ఉష్ణోగ్రతలు..
Mount Abu

ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోడుతున్నాయి. రాజస్థానాలోని చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల సెల్సియస్‌లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. పర్యాటక ప్రాంతం మౌంట్ అబూలో ప్రస్తుత సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, నొయిడా, హర్యానాలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుతున్నప్పటికి.. కొండ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత పెరగడంతో పాటు.. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని మౌంట్ అబులో మంగళవారం ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గత నాలుగు రోజులుగా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్ నుండి ఒక డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎంతో మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉదయం సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువుగా ఉండటంతో రూములకే పరిమితమై.. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్న తర్వాత బయటకు వస్తున్నారు. మౌంట్ అబూ వద్దకు చేరుకున్న కొంతమంది పర్యాటకులు అయితే చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ హిల్ స్టేషన్‌లో ట్రెక్కింగ్ చేస్తూ.. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడంతో నక్కి సరస్సు వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉదయం 9 నుంచి పది గంటల మధ్యలోనూ ఎడారిగా కనిపిస్తున్నాయి. మౌంట్ అబులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇక్కడి పర్యాటకులు, స్థానికులు సైతం చలి మంటలు కాచుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఉదయం సమయంలో చలి మంటలే కనిపిస్తున్నాయి. ఉదయం పది గంటలైనా దుకాణ సముదాయాలు తెరచుకోవడం లేదు.

పశ్చిమ రాజస్థాన్‌లోని చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా 5.1 డిగ్రీల సెల్సియస్ నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతం మినహా మిగిలిన చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల సెల్సియస్ తక్కువుగా నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. రానున్న నాలుగైదు రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుండి 10 డిగ్రీల సెల్సియస్‌ ఉండే అవకాశం ఉందని తెలిపారు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర చలికి ముసలివాళ్లు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదవుతున్న క్రమంలో ఉత్తర భారత దేశంలో చాలా మంది హీటర్లను ఉపయోగించి.. చలి నుంచి రక్షణ పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu