Savings: మనకు వచ్చే ఆదాయంలో పొదుపు ఎంత ఉండాలి.. భవిష్యత్తుకు భరోసానిచ్చే ఫైనాన్షియల్ టిప్స్ మీకోసం..

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Nov 30, 2022 | 5:00 AM

నేటి ఆధునిక కాలంలో ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు.. వచ్చే సంపాదనలో ఎంత పొదుపు చేస్తున్నాం అనేది ముఖ్యం. సంపాదన అనేది జీవితంలో కొంతకాలం మాత్రమే చేయగలం.. కాని ఖర్చులు మొత్తం వ్యక్తి బతికున్నంత వరకు ఉంటాయి. మనం సంపాదించే ఆదాయం..

Savings: మనకు వచ్చే ఆదాయంలో పొదుపు ఎంత ఉండాలి.. భవిష్యత్తుకు భరోసానిచ్చే ఫైనాన్షియల్ టిప్స్ మీకోసం..
Savings

నేటి ఆధునిక కాలంలో ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు.. వచ్చే సంపాదనలో ఎంత పొదుపు చేస్తున్నాం అనేది ముఖ్యం. సంపాదన అనేది జీవితంలో కొంతకాలం మాత్రమే చేయగలం.. కాని ఖర్చులు మొత్తం వ్యక్తి బతికున్నంత వరకు ఉంటాయి. మనం సంపాదించే ఆదాయం లేదా జీతంలో భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయాలని చాలామంది చెబుతుంటారు. కొంతమంది ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకుంటే.. మరికొంతమంది మాత్రం పొదుపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తీరా రిటైర్మెంట్ తర్వాత.. పరిస్థితులను చూసి బాధపడుతూ ఉంటారు. గతంలో నేను ఇలా చేసి ఉంటే ప్రస్తుతం నా పరిస్థితి బాగుండేది కదా అని అనుకుంటాం. అదే మొదటినుంచి పొదుపును అలవాటు చేసుకున్న వారి భవిష్యత్తు మాత్రం బంగారుమయం అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పొదుపు చేయడం ఒకటేతే మనం పొదుపును ఎలా చేస్తున్నాం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కొన్ని సందర్భాల్లో మన డబ్బులను నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ పొదుపు చేసే ముందు అన్ని విషయాలను ఆలోచించుకోవడంతో పాటు.. ఏ పద్ధతిలో పొదుపు చేయాలనుకుంటున్నామో తెలుసుకోవాలి.

ఎంత పొదుపు చేయాలి..

పొదుపు చేయడంతో పాటు నెలకు నెలకు తగిన మొత్తంలో పొదుపు చేస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన అంశం నెలవారి ఆదాయంలో కనీసం 30 శాతం మదుపు చేస్తే అది మన భవిష్యత్తు అవసరాలకు సరిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అయితే ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కొంత మొత్తం ముందే పొదుపు అవుతుంది. కాబట్టి జీతం ద్వారా చేసే మదుపు మన ప్రస్తుత జీవన విధానాన్ని కొనసాగించడానికి సరిపోతుంది.

పొదుపు లక్ష్యం

ప్రతీ ఏడాది జనవరి నెలలో చాలామంది ఉద్యోగులు, తాము పని చేసే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ దాఖలు చేసే సమయంలో పొదుపు గురించి ఆలోచిస్తారు. సెక్షన్ 80సీ ద్వారా కలిగే రిబేటు కోసం ఎంతో కొంత పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇది సరైన నిర్ణయం కాదంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్. మన భవిష్యత్తుకు భరోసా అనే ఆలోచనతోనే పొదుపు చేయాలి.

ఆర్థిక క్రమశిక్షణ

మనం మదుపు చేసే మొత్తం మన ఆర్థిక క్రమశిక్షణ ఫలితం అనే విషయం మర్చిపోకూడదు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే ఆర్థిక క్రమశిక్షణ కూడా మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.

వివిధ మార్గాలలో మదుపు

పొదుపు అనేది దీర్ఘకాలికమైన అంశం. అయితే మదుపు చేసే ప్రతీ మార్గంలో ఎంతో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే జాతీయ బ్యాంకుల్లో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లో ఎలాంటి రిస్క్ ఉండదు అనుకుంటాం కానీ అందులో కూడా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అందుకే మదుపు మొత్తం ఒక మార్గం ద్వారా కాకుండా విభిన్న మార్గాల్లో చేయాలి. ఈ అలవాటు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక పొదుపు మార్గం ద్వారా నష్టం వచ్చినా, మరో మార్గం ద్వారా లాభం వస్తే మొత్తంగా మన ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక రంగంలో సంక్షోభం ఉన్న సమయంలో మరో రంగం బాగా రాణించవచ్చు. ఆ విధంగా మన రిస్క్ తగ్గించుకోవచ్చు.

ఆర్థిక లక్ష్యాలకు తగిన మదుపు

మన ఆర్థిక లక్ష్యాలకు మనం చేసే మదుపుకు మధ్య సమన్వయం ఉండాలి. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అటు మదుపు మీద వచ్చే రాబడి, ఇటు మన అవసరాలు కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అందువల్ల మన ఆర్థిక లక్ష్యాలను కూడా మూడు రకాలుగా విభజించుకుని తగిన పొదుపు మార్గాలు ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu